జ‌న‌సేన అధినేత‌ను క‌లిసిన ప‌సిడి పత‌క విజేత

R.Venkat rahul & Pavan kalyan
R.Venkat rahul & Pavan kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని కామన్వెల్త్ గేమ్స్ లో ప‌సిడి ప‌త‌క‌ విజేత రాగాల వెంకట్ రాహుల్ కలిశారు. 85 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం సాధించిన రాహుల్ హైదారబాద్ లో పవన్ ని కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ ని పవన్ అభినందించారు. ఈ నెల 30న రాహుల్ కు బాపట్లలో భారీ సన్మానం చేస్తున్నామని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. తన కొడుకును క్రీడల వైపు ప్రోత్సహించిన రాహుల్ తండ్రి మధును కూడా పవన్ అభినందించారు. బాపట్లలో నిర్వహించనున్న సన్మానంలో రాహుల్ తో పాటు అతని తండ్రిని కూడా సన్మానించనున్నట్టు పేర్కొంది. కాగా, రాహుల్ కు పది లక్షల రూపాయలు ఇస్తానని పవన్ ఇటీవల ప్రకటించారు. 30న జరగబోయే సన్మాన కార్యక్రమంలో రూ.10 లక్షల చెక్ ను అందజేయనున్నారు.