జ‌న‌సేన‌తో జంట‌గా బాబు న‌డిస్తే బాగుండేది

PAWAN, CHANDRABABU
PAWAN, CHANDRABABU

విజ‌య‌న‌గ‌రంః ప్రత్యేక హోదా కోసం జనసేనతో కలిసి.. సీఎం చంద్రబాబు పోరాడితే రాష్ట్రం బాగుపడేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాలకు 10 కోట్లు కూడా ఇవ్వకుండా.. అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. పోలవరంపై చూపే శ్రద్ధలో సగం ఉత్తరాంధ్రపై చూపితే బాగుండేదని, ఇదే కొనసాగితే ఉత్తరాంధ్రాలో మరో ప్రజా పోరాటం వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారం రెండు కుటుంబాలకు పరిమితమౌతుందని పవన్‌ దుయ్యబట్టారు.