జ‌న‌సంద్రంగా కొంగ‌ర‌క‌లాన్‌

Kongarakalan 1
Kongarakalan

రంగారెడ్డిః టిఆర్ఎస్ తలపెట్టిన కొంగర కలాన్ ప్రగతి నివేదన సభకు లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు హాజరవుతున్నారు. తెలంగాణ అన్ని జిల్లాల నుండి ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే సభ ప్రాంగణం జనాభాతో కిక్కిరిసిపోయింది. వేలాది వాహనాలు ఇంకా రోడ్ల మీదనే ఉండగా ఇప్పటికే సభా ప్రాంగణం గులాబీ మయమయింది. సాక్షాత్తు మంత్రులే సమన్వయం చేయడంతో ప్రజలకు ఇబ్బందులు కూడా లేకుండా చూశారు. ఇంకా సభా కార్యక్రమానికి సమయం ఉండగా ముందుగా వచ్చిన ప్రజలను అలరించడానికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అద్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను భారీగా ఏర్పాటు చేయగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ సాంస్కృతిక నృత్యాలతో కళాకారులు ప్రజలను ఆకట్టుకుంటున్నారు.