జ‌గ‌న్‌తో పాటు మ‌రికొంద‌రు కోర్టుకు హాజ‌రు

jagan
jagan

నాంప‌ల్లిః ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ కేసులో దాఖలైన రెండు చార్జిషీట్లపై విచారణ జరుగుతోంది. జగన్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పెన్నా ప్రతాప్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, బీపీ ఆచార్య, శ్రీనివాసన్‌, ఇందూ శ్యాం ప్రసాద్ తదితరులు కూడా సీబీఐ కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు.