జ‌గ్గంపేట నుంచి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర

Y S Jagan 2
Y S Jagan

తూర్పు గోదావ‌రిఃవైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 223వ రోజు కార్యాచ‌ర‌ణ ఖ‌రారైంది. జగ్గంపేట నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. రేపు ఉదయం జగ్గంపేట నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రామవరంకు పాదయాత్ర చేరుకుంటుంది. అనంతరం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర కిర్లంపూడి మండలంలోకి ప్రవేశిస్తుంది. కిర్లంపూడి మండలంలోని గొనెడ, రామచంద్రాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.