జ్యూరిచ్‌ విమాశ్రయంలో కెటిఆర్‌కు ఘనస్వాగతం

Telangana Mister Ktr1
K T R

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు స్విజ్జర్లాండ్‌కు చేరుకున్న పరిశ్రమల శాఖమంత్రి కె.తారకరామారావుకు జ్యూరిచ్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభిచింది. విమావ్రయంలో ప్రవాస భారతీయులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారైత విభాగం నేతలుమంత్రి కెటిఆర్‌కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం శనివారం జ్యూరిచ్‌ నగరానికి చేరుకుంది. ఆదివారం జ్యూరిచ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశానికి బయలుదేరుతారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అందించిన ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరవుతారు. 22 నుంచి 26వ తేది వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. టిఆర్‌ఎస్‌ నాయకులు మహేష్‌ బిగాల గుప్త, అనిల్‌ కర్మాచలం, అశోక్‌, నవీన్‌, తెలంగాణ జాగృతి యుకె ప్రతినిధి బృందం మంత్రికి స్వాగతం పలికారు.