జ్ఞానమే నిలుస్తుంది

                 జ్ఞానమే నిలుస్తుంది

OHM
OHM

అందాన్ని అందంగా చూడటం జ్ఞానం. అందాన్ని అందంగా చూడలేకపోవటం అజ్ఞానం. జ్ఞానాజ్ఞానములే కాదు, విశేషజ్ఞానం కూడా ఒకటుంది. సుందరమైన వస్తువ్ఞను సుంద రంగా దర్శించడమే కాకుండా శ్యామసుందరునిగా దర్శించి ఆనందించడం విశేషజ్ఞానం. జగత్తును జగత్తుగా కాకుండా జగదీశ్వరునిగా దర్శించడం విశేషజ్ఞానం. ఈ ప్రపంచమంతా పరమేశ్వరుని వ్యక్తస్వరూపమే అనే జ్ఞానం. జగత్తులోని విజ్ఞానమంతా ఆయన విభూతియే అనే సుజ్ఞానం. సుజ్ఞాన ప్రదీపం బుద్ధిలో వెలుగుతూ ఉంటే మనిషిలో సంతోషం, ప్రేమ వ్యక్తం కాకుండా ఉండలేవ్ఞ.

దీపం వెలుగుతూ ఉండాలి. మనిషి నవ్ఞ్వతూ ఉండాలి. ఆనందంగా ఉండాలి. నూనె ఉంటేనే దీపం వెలుగుతుంది. జ్ఞానం ఉంటేనే, సుజ్ఞానం ఉంటేనే, విశేష జ్ఞానం ఉంటేనే మనిషి ఆనందంగా బ్రతకగలడు. నీరు అంతా ఒక్కటే. ఎవరు త్రాగితే వారి దప్పిక తీరుతుంది. జ్ఞానమంతా ఒక్కటే. ఎవరు పొందితే వారికే ఉంటుంది. తినడానికి ఎన్నయినా ఉండొచ్చు. తినేవాడికి ఆకలి ఉండాలి. ఆసక్తి ఉండాలి. తెలుసుకోవటానికి జ్ఞానం సిద్ధంగా ఉండొచ్చు. తెలుసుకొనేవాడికి ఆర్తి ఉండాలి. భక్తి ఉండాలి. భక్తి నైవేద్యంగా మారితే, ముక్తి ప్రసాదంగా అందుతుంది.

మనస్సులో మరొకదాని కొరకు కాకుండా కేవలం భగవంతుని కొరకే ఆలోచన కదిలితే అదే భక్తి భావన. భావనాభక్తి. అట్టి పవిత్రభావనలో ఎవరో లేరు, ఏదో లేదు. పరమాత్మే ఉన్నాడు. ఉన్నదంతా తానై ఉన్నాడు. ఒక ప్రదేశానికి మరొక కారణంగా వెళ్లకుండా కేవలం భక్తి కొరకే వెళ్తే, ఆ ప్రదేశం ఏదైనా సరే, ఆలయమే అవ్ఞతుంది. అక్కడ జరిగే దంతా అర్చనే అవ్ఞతుంది. భక్తి పవిత్రం. భక్తి కార్యాలు పరమపవిత్రాలు. భక్తిలో అహంకారం చేరితే భక్తి మలిన పడుతుంది. అపవిత్రమవ్ఞతుంది. అనర్థంగా మిగులుతుంది. అహంకారిలో ఉండేది భక్తి కాదని చెప్పలేము.

అది భక్తే కావచ్చు. కాని ముక్తికి ఉపకరించదు. పాలు పవిత్రమైన ఆహారము. విషం కలిస్తే, అప్పుడు కూడా అవి పాలే. కాని, పానయోగ్యం కావ్ఞ. విషం కలిసిన పాలలాగా అహంకారం కలిసిన భక్తి నిష్ప్రయోజనం. నిరుపయోగం. మనకు దగ్గరగా ఏవైనా ఉండొచ్చు. ఇవి నావి అనే బుద్ధి లేకుంటే చాలు. మననుండి ఏవైనా దూరంగా పోవచ్చు. ఆ పోయినవి నావా అనే బుద్ధి కూడా పోతే ఒక బ్రతుకులో బాధలుండవ్ఞ. ‘నావి అనే బుద్ధి లేనప్పుడు, ఏవి ఉన్నా అవి బ్రతుకులో ఉంటాయే గాని బుద్ధిలో ఉండవ్ఞ.

బుద్ధిలో లేనివి బ్రతుకులో ఉండినా, ఊడినా మనకు ఒరిగేదుండదు. తరిగేదుండదు. భగవత్ప్రీత్యర్థం కర్మ చెయ్యాలి అంటారు. నేను ఏ కర్మ చేస్తే భగవంతు నికి ప్రీతి? ఏది అప్రీతి? నేను కర్మ చేస్తే, ఆ కర్మఫలం నాకు వస్తుంది గాని పరమాత్మకు ఎలా పోతుంది? ఒకరు భోంచేస్తే మరొకరికి ఆకలి తీరుతుందా? అయినా, నా కర్మఫలం పరమాత్మకు ఎందుకు? కర్మఫలాన్ని నాకు ప్రసాదించేది అతడు కాడా? అనంతుడైన పరమాత్మను తృప్తిపరచేది నా కర్మఫలమా? రాగద్వేషాలు అంటకుండా, అహంకారం సోకకుండా, కర్మలాచరిస్తే నేను ప్రశాంతతను పొందుతాను.

ఇది నాకు కలిగే ప్రీతి. తృప్తి, సంతృప్తి. ఇది అర్థం గాక పరమాత్మతో కూడా బేరాలు సాగిస్తున్నాం. వ్యాపారాలు కొనసాగిస్తున్నాం. ‘ఇది నాది అనుకుంటే అది దూరమైన నాడు ‘నాది పోయింది అను కోవటం జరుగుతుంది. ‘నాది అనుకోకపోతే, పోయిన రోజు ‘అది పోయింది అవ్ఞతుందే గాని ‘నాది పోయిందిగా ఉండదు. మనం గ్రహించని దానిని మన నుండి ఎవ్వరూ గ్రహించలేరు. ఉండేవి ఉండనీ. ఉన్నవన్నీ మనవి కానవసరం లేదు. మనవిగా ఉండన వసరం లేదు. మనవైతే మనల్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్తాయి? మనకు జ్వరం ఉంది. తలనొప్పి ఉంది.

అజీర్ణము ఉంది. అజ్ఞానము ఉంది. ఇవన్నీ, పోకుండా మనకే ఉండాలి! మన వద్దే ఉండాలా? ఈ ప్రపంచంలోకి మనం వట్టి చేతులతో రాలేదు. ప్రారబ్ధాన్ని వెంటపెట్టుకొని వచ్చాం. ఏదో చెయ్యాలని విర్రవీగినా చేయగలిగింది మాత్రమే చెయ్యగలం. ఇది అర్థమైతే, ఆ తరువాత, ఎంతో, ఎంతెంతో చేయాలనే ఉబలాటం కన్నా, ఏ కొంత చేసినా, అది అందంగా, అర్థవంతంగా ఉంటుంది సుఖసంతోషాలతో బ్రతుకును శోభింపచేస్తుంది. అతిగా ఆలోచించడం కన్నా మితంగానైనా హితాన్ని ఆచరించి జీవించడంలోనే విజయాలు దాగి ఉన్నాయి.

సాధారణ సంకల్పాలతో, సామాన్యులు సాగించే ఆలోచనలతో సామాన్యులమవ్ఞతాం. సాధువ్ఞలం కాలేము. ఈరోజు పోయినా, మరోరోజు పోయినా, పోయేదే కనుక దేహం పోతుంది. పడిపోతుంది. ఈరోజు వచ్చినా, మరో రోజు వచ్చినా, వస్తే పోనిది కనుక జ్ఞానం ఉంటుంది. మనలో నిండి ఉంటుంది. ఉండిపోయేవి పోనివ్వండి. వచ్చిపోకుండా ఉండే జ్ఞానమే రానివ్వండి.