జోగులాంబ బ్రహ్మోత్సవాలకు సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం

హైరదాబాద్‌: ఈ నెల 12 నుండి 16వ తేదీ వరకు అలంపూర్‌లో జరిగే జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ.. సోమవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌కు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆలయ చైర్మన్ రవి ప్రకాశ్ గౌడ్‌ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు రావలసిందిగా కోరారు. అంతకు ముందు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, ఆల‌య చైర్మన్ ర‌విప్రకాష్ గౌడ్, ధ‌ర్మక‌ర్త న‌ర్సింహారెడ్డి, దేవాస్థాన అర్చకులు అర‌ణ్య భ‌వ‌న్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.