జైళ్లశాఖ డిప్యూటి ఐజిపై పరువునష్టంకేసు

Rupa Moudgiil
Rupa Moudgiil

బెంగళూరు: లంచాలను ఎరవేసి ఎఐఎడిఎంకె నేత వికె శశికళ బెంగళూరుకేంద్ర కారాగారంలో ప్రాధాన్యతాక్రమంలో ప్రత్యేక సౌకర్యాలు
పొందారని ఆరోపించిన జైళ్లశాఖ డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రూపా డి మౌద్గిల్‌పై సీనియర్‌ మాజీ పోలీస్‌ అధికారి హెచ్‌ఎన్‌ సత్యన్నారాయణ
రూ.20 కోట్లకు పరువునష్టం కేసు దాఖలుచేశారు. జైళ్లశాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న సత్యన్నారాయణరావు బెంగళూరులోని సివిల్‌కోర్టులో
ఈ పిటిషన్‌ వేసారు. అంతేకాకుండా ఒక ఆంగ్ల దినపత్రిక, ఒకప్రాంతీయభాషా ఛానెల్‌పై కూడా ఈ కేసులో వేరువేరు పిటిష్టన్లు వేసారు. తనపై
మౌద్గిల్‌ చేసిన ఆరోపణలపై ఆయన ఈ పరువునష్టంకేసును దాఖలుచేసినట్లు తెలిపారు. సత్యన్నారాయణ కౌన్సెల్‌ పిఎన్‌జయదేవ మాట్లాడుతూ
న్యాయమూర్తి ఈకేసును డిసెంబరు 12వ తేదీకి వాయిదావేసారని, అంతేకాకుండా రూపాకు నోటీస్‌ జారీచేసినట్లు వెల్లడించారు. ఆగస్టులో
రిటైర్‌ అయినరావు రూపా మౌద్గిల్‌ చేసిన అన్ని ఆరోపణలను ఖండించారు. అంతేకాకుండా అవాస్తవ ఆరోపణలు చేసినందుకుగాను తనకు
బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. రూపామౌద్గిల్‌ తన నివేదికలో తనకు కొన్ని ఆరోపణలు కూడా వినిపించాయని, శశికళ తనకు
ప్రత్యేక సౌకర్యాలకోసం రెండు కోట్ల రూపాయలు సీనియర్‌జైళ్ల అధికారులకు చెల్లించారని వారిలో రావు కూడా ఉన్నారని వెల్లడించారు.
తదనంతరం ఆమె పోలీస్‌ ఐజిగా బదిలీ అయ్యారు. బెంగళూరు ట్రాఫిక్‌ కమిషనర్‌గాను, రోడ్డుభద్రతా విభాగానికి ప్రభుత్వం బదిలీచేసింది.
కోర్టునుంచి తనకు నోటీస్‌ అందిన తర్వాత మాత్రమే జవాబివ్వగలనని రూపా వెల్లడించారు. తన నివేదికలో ఎత్తిచూపిన అవినీతి అంశాలు
ఇప్పటికీ విచారణకు రాలేదని ఆమె అన్నారు. దర్యాప్తులో ఈ అవినీతి ఆరోపణలు చేర్చకపోవడం శోచనీయమన్నారు. నేను అవినీతిపైనే
ప్రశ్నించానని, ఈకేసులో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదని ఆమె స్పష్టంచేశారు. రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి విన§్‌ుకుమార్‌ను ముఖ్యమంత్రి
గత జులైలోనే విచారణకు ఆదేశించారు. అయితే కుమార్‌తన నివేదిక వివరాలను వెల్లడించేందుకునిరాకరించారు. రెండునెలల క్రితమే తాను
నివేదికను ప్రభుత్వానికి అందచేసానని, ప్రస్తుతం హోంశాఖ పరిధిలో పరిశీలనలో ఉన్నదని చెప్పారు.