జైలులో శశికళకు విఐపి సౌకర్యాలు

sasikala
sasikala

ఐదు గదులు, ప్రత్యేక వంటమనిషి
విచ్చలవిడిగా సందర్శకులకు అనుమతి
ఆర్‌టిఐ దరఖాస్తుతో వెలుగుచూసిన నిర్వాకం
ముంబయి: బెంగళూరు పరప్పన అగ్రహారంజైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ జైలులో విఐపి సౌకర్యాలు పొందుతున్నారని ఆర్‌టిఐకార్యకర్త దాఖలుచేసిన పిటిషన్‌కు జవాబు స్పష్టంచేసింది. ఐదుగదులతోపాటు వ్యక్తిగతంగా వంటమనిషిని కూడా ఏర్పాటుచేసుకున్నారని, జైలులో శశికళకు విఐపి సౌకర్యాలు అందుతున్నట్లు ఆర్‌టిఐ దరఖాస్తుకు జైలు అధికారులు సమాధానం ఇచ్చారు. కార్యకర్త నరసింహమూర్తి చేసిన దరఖాస్తుకు ఇచ్చినసమాధానాన్ని చూస్తే విఐపి వసతులు కల్పించడంలో నిబందనలు సైతం ఉల్లంఘించారని ఆరోపించారు.అంతేకాకుండా ఆమెకు ఎలాంటి పరిమితులు లేకుండా సందర్శకులను అనుమతిస్తున్నారని వెల్లడించారు. 59 ఏళ్ల శశికళ ప్రస్తుతం నాలుగేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు బెంగళూరు న్యాయస్థానం శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మహిళా ఖైదీలు జైలులో నాలుగు గదుల్లో ఉంటున్నారని, వారిని బైటికి పంపించి మొత్తం ఐదు గదులను వికెశశికళకు కేటాయించారని 2017 ఫిబ్రవరి 14వ తేదీనే ఈ గదులను ఆమెకు కేటాయించారని వెల్లడించారు. జైలులో ప్రత్యేక వంటకు తావులేదని, అయితే జైలు అధికారులు ఒక ప్రత్యేక వంటమనిషిని శశికళకోసం కేటాయించారని పేర్కొన్నారు. ఈకేసులో నిబందనలను యదేచ్ఛగా ఉల్లంఘించారన్నారు. అంతేకాకుండా సందర్శకులు నేరుగా ఆమె గదికివెళ్లి బసచేసి మూడునాలుగు గంటలు చర్చలుజరుపుతున్నారని మూర్తి పేర్కొన్నారు. అప్పటి డిఐజి డి.రూప మొదటిసారిగా 2017 జులై 13వ తేదీ ఈ అంశాన్ని వెలుగులోనికి తెచ్చారు. శశికళ ఆమె అనుయాయులకు ప్రాధాన్యతాక్రమంలో గౌరవం ఇస్తున్నారని, అంతేకాకుండా ఇందుకు సంబంధించి రెండుకోట్ల రూపాయలు ముడుపులు అందాయనిసైతం ఆమె ఆరోపించారు. వెనువెంటనే కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. తన పై అధికారులకు రూప ఈ నివేదిక ఇచ్చింది. జైళ్లశాఖ డిజిపి హెచ్‌ఎస్‌ సత్యనారాయణరావు, అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు ఈ ఆరోపనలపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. రిటైర్డ్‌ డిజిపి సత్యనారాయణరావు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. తదనంతరం రూపను ట్రాఫిక్‌ విభాగానికి బదిలీచేసారు. రావును శెలవుపై వెళ్లాలని ఆదేశించారు. రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి విన§్‌ుకుమార్‌ ఈకేసును విచారణచేసారు. ఆయన తన విచారణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రస్తావించారు. శశికళా ఆమె అనుయాయులు మరికొన్నినిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడించారు.కర్ణాటక డిప్యూటి సిఎం జి.పరమేశ్వర అప్పటి హోంమంత్రిగా ఉన్నారు. ఈ నివేదికలపై ఆయన స్పందన కోరితే తనకు వాటిపై స్పష్టమైన సమాచారం లేదని తప్పుకున్నారు.