జైలులో ఖైదీ ఆత్మహత్య

breaking newsbreaking news
breaking news

అనంతపురం: భార్యను హత్య చేసిన కేసులో ఖైదీగా జైలు శిక్షణ అనుభవిస్తున్న భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం సబ్‌జైలులో చోటు చేసుకుంది. మడకశిర మండలం జంబులబండ గ్రామానికి చెందిన పట్నాయక్ అనే వ్యక్తి గత 5 రోజుల క్రితం భార్యను హత్య చేశాడు. ఈ కేసులో హిందుపురం సబ్ జైలుకు తరలించారు. మంగళవారం సాయంత్రం హిందూపురం సబ్ జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి ఖైదీలు సబ్ జైలు సిబ్బందికి తెలియజేయడంతో పట్నాయక్‌ను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే సబ్ జైలు సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించారంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.