జైలులోనే షరీఫ్‌పై మరోరెండుకేసుల విచారణ

Nawaz shareef
Nawaz shareef

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో అరెస్టు అయి రావల్పిండి జైలుకు తరలించినమాజీ ప్రధానినవాజ్‌షరీఫ్‌పై మరో రెండు అవినీతికేసులున్నాయి. వాటినిసైతం విచారిస్తామని పాకిస్తాన్‌ అవినీతినిరోధక కేసుల కోర్టు వెల్లడించింది. ఈ రెండుకేసుల విచారణ రావల్పిండిలోని ఆదియాలాజైలులోనే జరుగుతుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా నవాజ్‌షరీఫ్‌కు ఒక మంచి, కుర్చీ, లాంతరును రావల్పిండి జైలు అధికారులు కేటాయించారు. ఆయన కుమార్తె మరియంకు బిగ్రేడ్‌ జైలు విభాగాలను కేటాయించారు. పాకిస్తాన్‌లోని న్యాయమంత్రిత్వశాఖ ఈ రెండు కేసుల విచారణ షరీఫ్‌ ఆయన కుటుంబసభ్యులపై రావల్పిండి జైలులోనే కొనసాగించాలనినిర్ణయించింది. నేషనల్‌ అకౌంటబిలిటీ చట్టం 1999 ప్రకారం ఫెడరల్‌ప్రభుత్వం ఆదియాలా సెంట్రల్‌జైలులో విచారణకు సంబంధించిన ఏర్పాట్లుచేయాలని, అకౌంటబిలిటీ కోర్టు ఈజైలులో విచారణ నిర్వహిస్తుందని మియాన్‌ ముహమ్మద్‌ నవాజ్‌ షరీఫ్‌ ఇతరులపై జైలులోనే విచారణచేస్తామని ప్రకటించింది. ఈనెల 6వ తేదీ ఎన్‌ఎబి షరీఫ్‌ ఆయన కుమార్తె మరియం, అల్లుడు కెప్టెన్‌ సఫ్దర్‌లకు జ.ఐలుశిక్ష విధించింది. అవెన్యూ ఫీల్డ్‌ స్థిరాస్తుల వ్యవహారంలో అవినీతి జరిగిందన్న అభియోగాలు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించిమొత్తంమూడు కేసులు నమోదయితే మరో రెండుకేసులు విచారణకు రానున్నాయి. పనామాపేపర్స్‌ లీకేజిల వ్యవహారంలోనే ఈకుంభకోణాలు వెలుగులోనికి వచ్చాయి. లండనంలోని సంపన్నులు అధికంగా ఇవసించే మేఫెయిర్‌ ప్రాంతంలో నాలుగు విలాసవంతమైన అపార్టుమెంట్లు కొనుగోలుచేసారన్న అభియోగం ప్రధానమైనది. షరీఫ్‌కుటుంబం మరిన్న అవినీతికేసులు ఎదుర్కొంటున్నది. ఆల్‌అజీజియా స్టీల్‌మిల్స్‌, కీలక పెట్టుబడులపై కూడా షరీఫ్‌ పై మనీలాండరింగ్‌ అభియోగాలున్నాయి. పన్నుల ఎగవేతనేరారోపణలు ఉన్నాయి. మరొక అకౌంటబిలిటీకోర్టుకు తన రెండుకేసులను బదిలీచేయాలన్న షరీఫ్‌ వాదనను ఎన్‌ఎబి కొట్టివేసింది. ఇస్లామాబాద్‌కోర్టు న్యాయమూర్తి ముహ్మద్‌ బాషిర్‌ ఈమేరకు ఉత్తర్వులుజారీచేసారు. షరీఫ్‌ కుటుంబసభ్యులపై నేరాలునమోదయ్యాయని విచారణజయిగుతుందన్నారు. బదిలీచేయాలంటే అందుకు హైకోర్టును సంప్రదించాలనిసూచించారు. వివిధప్రాంతాలనుంచి వేరొక ప్రాంతానికి బదిలీచేయాలంటే సుప్రీంకోర్టును సంప్రదించాల్సి ఉంటుందని జడ్జి వెల్లడించారు. గురువారంనాటి విచారణలో షరీఫ్‌తరపు న్యాయవాది క్వాజా హారిస్‌ మాట్లాడుతూ జడ్జి బషీర్‌ ఇప్పటికే తన అభిప్రాయాన్ని బహిరంగంగాచెప్పారని, గల్ఫ్‌స్టీల్‌ మిల్స్‌పై సంయుక్త విచారణకమిటీ నివేదికపై ఆయన అభిప్రాయం బహిరంగంగా చేసారని ఆరోపించారు. జడ్జిబషీర్‌ తన అభిప్రాయాలను బహిరంగపరిచినందున ఈ కేసులకు మరో న్యాయమూర్తిని నియమించాలని కౌన్సెల్‌ కోరింది. ఎన్‌ఎబి ప్రాసిక్యూటర్‌ మాట్లాడుతూ జడ్జి బషీర్‌ మొత్తం అన్నివైపులా వాదనలు విన్నారని, ఆయన్నే కొనసాగించాలని వాదించింది. తిరిగి జులై 17వ తేదీకి విచారణ వాయిదాపడింది. పాకిస్తాన్‌కు రాగానే లాహోర్‌లో వారిని అరెస్టుచేసి ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్‌ కు తరలించారు. అక్కడినుంచి ఆదియాలాజైలుకు ప్రత్యేక సాయుధ వాహనాల్లో తరలించారు. అయితే జైలులో పాకిస్తాన్‌నిబందనల ప్రకారం క్లాస్‌ బి ఖైదీలంటే సామాజిక హోదా, విద్య,విభిన్నజీవనశైలి ఉన్నవారని పరిగణిస్తారు. వారికిచ్చిన గదులు మంచం, కుర్చీ,స్నానంగదులు, వంట ఉపకరణాలు ఉంటాయి. ఇక టివి ఎయిర్‌కండిషనర్‌, రఫిడ్జి వంటివి, దినపత్రికలు ఖైదీలే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. అవికూడా జైళ్లశాఖ అనుమతితోనే సమకూరుస్తారు. ఎ లేదా బి తరగతి ఖైదీలు ఎక్కువగా నిరక్షరాస్యులైన ఖైదీలకు విద్యను బోధిస్తారు. వారికి కఠోరశ్రమతో కూడిన పనులు ఇవ్వరు. వారికి రోజువారి పనులు మాత్రమే ఇటువంటివి కేటాయిస్తారు.