జేడీయూ ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్‌ కిషోర్‌

PRASHANT KISHORE
PRASHANT KISHORE

పాట్నా: ఈ ఏడాది సెప్టెంబరు నెలలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ జనతాదళ్‌ యునైటెడ్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ప్రశాంత్‌ కిషోర్‌ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియామకం అయ్యారు. ఈ మేరకు జేడీయూ చీఫ్‌, బీహార్‌ నితీశ్‌ కుమార్‌ కిషొర్‌ను సాదరంగా ఆహ్వానించారు. 2019లో తమ పార్టీ తరఫున పోటీ చేయాలని బిజెపి, కాంగ్రెస్‌ నుంచి ఆఫర్లు వచ్చినా వాటిని ఆయన తిరస్కరించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంగా పనిచేస్తున్న జేడీయూకు ప్రశాంత్‌ చేరిక కొంత బలాన్నిచ్చింది.