జేడీయూలో స‌స్పెన్ష‌న్ల ప‌రంప‌ర‌

janatha dal u
janatha dal u

పట్నా: బిహార్‌లో రాజకీయాలు రోజూరోజుకి మ‌రింత వెడెక్కుతున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ
శరద్‌యాదవ్‌ వర్గానికి చెందిన మ‌జీ మంత్రి రమాయ్‌ రామ్‌, మాజీ ఎంపీ అర్జున్‌ రాయ్ స‌హ 21మందిని జేడీయూ సస్పెండ్ చేసింది.
వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు జేడీయూ బిహార్‌ అధ్యక్షుడు వశిష్ఠ నారాయణ ప్రకటించారు.మహాకూటమిని వీడి భాజపాతో చేతులు
కలపడాన్ని జేడీయూ నేత శరద్‌యాదవ్‌ వ్యతిరేకించిన సంగతి తెలసిందే. దీంతో ఆయన్ను రాజ్యసభలో పార్టీ పక్షనేతగా తొలగించి
ఆర్సీపీ సింగ్‌ను నియమించింది. అంతకుముందు సోనియా గాంధీ నిర్వహించిన విపక్షాల సమావేశానికి హాజరైన కారణంగా రాజ్యసభ
సభ్యుడు అలీ అన్వర్‌ను కూడా పార్టీ ఇది వరకే సస్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే ఈ విధంగా జేడీయూలో సస్పెన్ష‌న్ల ప‌రంప‌ర కొన‌సాగుతుంది.