జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌

JEE Mains
JEE Mains

న్యూఢిల్లీ: ఐఐటీ, ఎన్‌ఐటీలతో పాటు పలు ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో బి.టెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్ ప‌రీక్ష ఫలితాలను కేంద్రీయ మాధ్య‌మిక విద్యా మండ‌లి(సిబిఎస్ఈ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. అభ్యర్థుల మార్కులతో పాటు ర్యాంకులను కూడా ప్రకటించింది. ఈ నెల 8న జేఈఈ ఆఫ్‌లైన్ పరీక్ష, 15,16 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ర్టాల నుంచి సుమారు 1.50 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను www.jeemains.nic.in, cbseresults.nic.in అనే వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.