జెసి విమాన ప్రయాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

jc
jc

హైదరాబాద్‌: అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డిపై ఉన్న విమాన ప్రయాణ నిషేధాన్ని దేశీయ ఎయిర్‌లైన్స్‌
సంస్థలు ఎత్తివేశాయి. దీంతో జెసికి కాస్త ఊరట లభించినట్లయింది. గతంలో విశాఖ విమానాశ్రయంలో బోర్డింగ్‌
పాస్‌ కోసం ఇండిగో సిబ్బందితో గొడవపడిన ఆయనపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఐతే తన విమాన ప్రయాణంపై నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
అదలా ఉండగానే జెసిపై ఉన్న నిషేధం ఎత్తివేయడం గమనార్హం.