జెరూస‌లెంపై అమెరికా వీటో

UN general Assembly
UN general Assembly

ఇజ్రాయిల్‌ రాజధానిగా జెరూసలేంను ప్రకటించడాన్ని ఉపసంహరించుకోవలసిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పిలుపును ఇచ్చే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. గత ఆరేళ్లలో ఆమెరికా తన వీటో అధికారాన్ని వాడడం ఇదే తొలిసారి. ఆ నగరాన్ని ఇజ్రాయిల్‌ రాజధానిగా గుర్తిస్తూ తమ రాయబార కార్యాలయాన్ని అక్కడకు తరలిస్తారని ఈ నెల ఆరున ట్రంప్‌ ప్రకటించి పెద్ద దుమారం రేపారు. ప్రపంచ దేశాలు ఆయన ప్రకటనను తీవ్రంగా ఖండించాయి. అమెరికా అత్యంత సన్నిహిత 15 దేశాల భద్రతా మండలి సైతం ట్రంప్‌ ప్రకటనను ఖండించింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి చాలా కాలంగా జెరూసలేం పట్ల అనుసరిస్తున్న వైఖరిని బలపరుస్తూ వివాదాస్పద ప్రకటనను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌కు ఈజిప్టు ముసాయిదా కూర్చిన తాజా ఐరాస తీర్మానం పిలుపును ఇచ్చింది.