జెఫ్‌ బేజోస్‌కు బెదిరింపులు

Amazon
Amazon

హైదరాబాద్‌: అమెరికాలో నేషనల్‌ ఎంక్వైరర్‌ అనే మీడియా సంస్థ అమోజాన్‌ సంస్థ సీఈవో బెఫ్‌ బేజోస్‌నే బ్లాక్‌యెయిల్‌ చేస్తున్నది. తనకు సంబందిచిన రహస్య చిత్రాలు వారి వద్ద ఉన్నాయని, వాటిని పబ్లిష్‌ చేస్తామని మీడియా సంస్థ హెచ్చరించిందని బేజోస్‌ తెలిపారు. గర్లఫ్రెండ్‌కు పంపిన కొన్ని ఫోటోలు త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని అమెరికా టాబ్లాయిడ్ అంటోంది. వ్య‌క్తిగ‌త ఫోటోల‌ను బ‌హిర్గ‌తం చేయ‌డం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని, కానీ ఆ టాబ్లాయిడ్‌ను మాత్రం అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు బేజోస్ చెప్పారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో త‌న భార్య మెకంజీకు విడాకులు ఇస్తున్న‌ట్లు బేజోస్ చెప్పారు. అయితే టెలివిజ‌న్ యాంక‌ర్ లారెన్ సాంచేజ్‌తో బేజోస్ డేటింగ్ చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.