జెన్‌కో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 26 మంది ఎంపిక

TS GENCO
TS GENCO

హైదరాబాద్‌: తెలంగాణ జెన్‌కో అసిస్టెంట్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) పోస్టులకు 26 మందిని ఎంపిక చేసింది. మంగళవారం విద్యుత్‌సౌధలో వీరి ధృవపత్రాలను పరిశీలించనున్నారు. ప్రొవిజినల్‌ జాబితాలో ఉన్న వారంతా ధ్రువ పత్రాలతో హాజరుకావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.