జెడీఎస్ నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గాయ‌బ్‌

JDS
JDS

బెంగ‌ళూరుః కర్ణాటక రాష్ట్రంలో హంగ్ ఏర్పడడంతో రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. 104 సీట్లతో మొదటి స్థానంలో ఉన్న బీజేపీ ప్రధాన పక్షాలైన జేడీఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్తులకు గాలం వేసి సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రాంగాలు, వ్యూహాలను అమల్లో పెట్టేసింది. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ పక్షాల్లో ఆందోళన నెలకొంది. బీజేపీ పాచికలను చిత్తు చేసేందుకు అవి తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈనేపథ్యంలో ఈ రోజు బెంగళూరులో జేడీఎస్ శాసనసభాపక్షం సమావేశమైంది. దీనికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజా వెంకటప్ప నాయక్, వెంకట రావు నడగౌడలు కనిపించకుండాపోయారు.