జూలై 1న ప్రేమలీల….పెళ్ళీగోల

Premaleela Pelli gola
Premaleela Pelli gola

జూలై 1న ప్రేమలీల….పెళ్ళీగోల

ఇటీవల తమిళ్‌లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అయిన పెళ్లైకారన్‌ చిత్రాన్ని ప్రేమలీల…పెళ్ళిగోల టైటిల్‌తో ఫిలిమ్స్‌ అధినేత నిర్మాత పారస్‌ జైన్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విష్ణు విశాల్‌, నిక్కీ గల్రానీ నాయకా నాయికలుగా నటించారు. ఎళిల్‌ దర్శకత్వం వహించారు. అన్ని పనులు పూర్తిచేసుకుని జూలై 1న విడుదల అవ్ఞతుంది. ఈ సందర్భంగా శ్రీ మహావీర్‌ ఫిలింస్‌ అధినేత, నిర్మాత పారస్‌ జైన్‌ మాట్లాడుతూ ప్రేమలీల ఒకరిది. పెళ్ళిగోల మరొకరిది ఈ సినిమా కథ. కామెడీ…లవ్‌….ఎమోషన్స్‌ అన్నీ అంశాలతో పక్కా కమర్షియల్‌గా తెరకెక్కింది. మాతృకల విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంది. సినిమా చూసిన వాళ్ళంతా ఆద్యంతం కడుపుబ్బా నవ్ఞ్వకునే సినిమా అని ప్రశంసించారు. మా ద్వితియార్థంలో సాగే కామెడీ హైలైట్‌గా ఉంటుంది. జూలై 1న సినిమా విడుదల చేస్తున్నాం అని అన్నారు. చిత్ర హీరో విష్ణు విశాల్‌ మాట్లాడుతూ ఐటీ ఉద్యోగం చేసుకుంటోన్న సమయంలో తమిళ్‌ సినిమాల్లో అవకాశం రావడంతో హీరోగా టర్న్‌ అయ్యా. వెన్నైలా కబాడీ కుజు(భీమిలి కబడ్డి జట్టు) చిత్రం నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నా. ఇటీవల విడుదలైన వెల్లై కారన్‌ చిత్ర మంచి బ్రేక్‌నిచ్చింది. పెద్దహిట్‌ అయింది. జూలై తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.