జూలై 1న జిఎస్‌టి డేని జరపనున్న ప్రభుత్వం

GST
GST

న్యూఢిల్లీ: ఒకే దేశం-ఒకే పన్ను నినాదంతో ఆరంభమైన అతిపెద్ద ఆర్ధిక సంస్కరణ వస్తు-సేవల పన్ను(జిఎస్‌టి) అమల్లోకి వచ్చి రేపటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్బంగా జులై 1 వ తేదీని జిఎస్‌టి డే గా ప్రభుత్వం జరపనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్ధిక మంత్రిగా అదనపు బాద్యతలు నిర్వర్తిస్తున్న పీయూష్‌ గోయల్‌ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు. ప్రస్తుతం జిఎస్‌టి ప్రకారం నాలుగు శ్లాబుల కింద పన్నులను వసూలు చేస్తున్నారు. పలు వస్తువులపై 5, 12, 18,28 శాతాలు గల పన్నులను వసూలు చేయడం జరుగుతోంది. వినియోగదారులకు పన్ను భారం తగ్గించేందుకు జిఎస్‌టి నియంత్రణ మండలి ఎప్పటికప్పుడు సమావేశమవుతుంది. పలు వస్తువులను తక్కువ పన్ను రేటు ఉన్న శ్లాబుల్లోకి మారుస్తూ వస్తుంది.