జూలై లో ‘జైలవకుశ’ టీజర్‌

NTR-2
NTR-

జూలై లో ‘జైలవకుశ ‘టీజర్‌

తారక్‌ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జైలవకుశ చిత్రంచేస్తున్న సంగతి తెలిసిందే.. జనతా గ్యారేజ్‌ హిట్‌ తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా కావటం, అందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.. గత నెలలో విడుదలైన ఫస్ట్‌లుక్స్‌ కూడ సక్సెస్‌కావటంతో నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ టీజర్‌ను సిద్ధంచేస్తోంది. ఈ టీజర్‌ను జూలై మొదటివారంలో రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది.. ఈచిత్రంలో రాశీఖన్నా, నివేత థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా,దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, సికె మురళీధరన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.