జూలై మొదటి వారంలో లేడీడాన్
మమ్మూటి, కత్రినాకైఫ్ జంటగా మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని శ్రీ జె.వి.ప్రొడక్షన్స్ పతాకంపై లేడీడాన్ పేరుతో తెలుగులోకి అనువదించారు.. జూలై మొదటి వారంలో విడుదల చేస్తున్నారు.నిర్మాత ఎమ్.వెం కట్రావ్ మాట్లాడారు. యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. తెలుగులో అంతకంటే ఎక్కువ విజయం సాధిస్తుందన్నారు. లేడీడాన్ చిత్రాన్ని ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరించారు. సంగీత దర్శకులు జెస్సీగిఫ్ట్ చక్కటి సంగీతాన్ని అందించారు. ఇందులోని 4 పాటలను సింగపూర్, మలేషియా, బ్యాంకా క్లోని అందమైన లొకే షన్స్లో చిత్రీకరించారు. దర్శకులు ఐ .వి.శశి కథకు అనుగుణంగా తెరకెక్కించారు.