జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో మరో ట్విస్ట్..వీడియోస్ లీక్ చేసిన వ్యక్తి కి నోటీసులు

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో గంటకో ట్విస్ట్ బయటకొస్తుంది. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా దీనిపై స్పష్టమైన క్లారిటీ రాకవడం , నిందితులందర్నీ ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంతో అందరిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు నలుగురి నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడి కోసం గాలింపు చేస్తున్నారు. ఇదిలా ఉంటె ఘటనకు సంబదించిన వీడియోస్ బయకు లీక్ కావడం అనేది పోలీసులకు పెద్ద సమస్య గా మారింది. అసలు కార్ లో జరిగిన ఘటనకు సంబంధించి వీడియోస్ ఎలా బయటకు వచ్చాయనేదానిపై పోలీసులు ఆరా తీయగా ..ఆ వీడియోస్ లీక్ చేసిన వ్యక్తి ఆచూకీ ని కనుగొన్నారు.

కారులో ప్రయాణిస్తున్న నిందితుల వీడియోలను సర్క్యులేట్ చేసింది పాతబస్తీకి చెందిన మీడియా ప్రతినిధి సుభాన్ గా పోలీసులు గుర్తించారు. అతనికి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆర్ఎస్ మీడియా పేరుతో సుభాన్.. గ్యాంగ్ రేప్ బాధితురాలు నిందితులతో కలిసి కారులో ఉన్న వీడియోలను లీక్ చేయడంతో పాటు వైరల్ చేశారని పోలీసులు గుర్తించారు. సుభాన్ కు వీడియోలు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారు. మైనర్ బాలిక వీడియోలు బయటికి రావడం వెనుక ఎవరున్నారు.. ఎందుకు వైరల్ చేశారు.. కావాలనే చేశారా లేక తమ మీడియా ప్రమోషన్ కోసం ఇలా చేశారా అన్న కోణంలో సుభాన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.