జూబ్లీహిల్స్‌ నివాసానికి దాసరి భౌతికకాయం

Dasari2
Dasari (file)

జూబ్లీహిల్స్‌ నివాసానికి దాసరి భౌతికకాయం

హైదరాబాద్‌: దర్శకరత్న దాసరి భౌతికకాయాన్ని మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేర్చారు.. అభిమానులు, బంధువులు, ప్రముఖుల సందర్శనార్ధం దాసరి భౌతికకాయాన్ని ఆయన నివాసంలోనేఉంచారు..బుధవారం ఉదయం 10 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు తీసుకెళ్లనున్నారు.. అనంతరం సాయంత్రం 4 గంటలకు మెయినాబాద్‌ లోని ఫాంహౌస్‌లో దాసరి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నారు.