జూన్ 21న కేర‌ళ రాజ్య‌స‌భ ఎన్నిక‌లు

Kerala Rajyasabha
Kerala Rajyasabha

న్యూఢిల్లీ : కేరళ నుండి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు జూన్‌ 21న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ బుధవారం ప్రకటించింది. జులై1న ఖాళీ కానున్న రాజ్యసభ డిప్యూటి చైర్మన్‌ పిజె కురియన్‌ స్థానం కూడా వీటిిలో ఉంది. దీనికి సంబంధించి జూన్‌ 4న నోటిఫికెేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిపింది. కురియన్‌ (కాంగ్రెస్‌), సిపి నారాయణన్‌ (సిపిఐ-ఎం), జారు అబ్రహం(కేరళ కాంగ్రెస్‌-ఎం)లు జులై 1న రిటైర్‌ అవుతున్నారు. రాష్ట్రం నుండి మొత్తం 9 రాజ్యసభ స్థానాలకు గాను ప్రస్తుతం సిపిఎం, కాంగ్రెస్‌లు చెరో మూడు స్థానాలకు, కేరళ కాంగ్రెస్‌ ఎం, ఐయుఎంఎల్‌, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.