జూన్‌ 3 నుంచి సియం జిల్లాల పర్యటన

AP CM CHANDRA BABU NAIDU
AP CM CHANDRA BABU NAIDU

అమరావతి: సియం చంద్రబాబు నాయుడు జూన్‌ 3 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనల్లో భాగంగా నవ నిర్మాణదీక్ష, మహా సంకల్పంలో భాగంగా గ్రామదర్శిని, గ్రామ సభల కార్యక్రమాల్లో సియం పాల్గొననున్నారు. జూన్‌ 2 న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్ష చేపట్టనున్నారు. అలాగే 3న కర్నూలు, 4న విజయనగరం, 5న తూర్పుగోదావరి ,6న కడప, 7 న చిత్తూరు, 8న నెల్లూరు జిల్లాల్లో నిర్వహించనున్న మహాసంకల్ప బహిరంగ సభలలో సియం చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు.