జూన్‌ 15 నాటికి ప్రతిఇంటా మరుగుదొడ్డి

TS Minister Ktr
TS Minister Ktr

జూన్‌ 15 నాటికి ప్రతిఇంటా మరుగుదొడ్డి

హైదరాబాద్‌: కార్పొరేషన్లు, మునిసిపల్‌ కమిషన్లకు పట్టణాలపై పట్టుఉండాలని మంత్రి కెటిఆర్‌ అన్నారు.. సోమవారం జరిగిన సమావేశంలో కమిషనర్లు, కార్పొరేషన్‌ కమిషన్లతో ఆయన సమావేశం నిర్వహించారరు. ఓడిఎస్‌ విషయంలో వెనుకబడ్డ పట్టణాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.. మునిసిపల్‌ కమిషనర్లు చురుగ్గా పనిచేస్తే పట్టణాల రూపురేఖలు మారతాయన్నారు.. డిసెంబర్‌లో అన్ని పట్టణాలు ఓడిఎస్‌లుగా ప్రకటించాలని అన్నారు. జూన్‌ 15 నాటికి ప్రతిఇంటా మరుగుదొడ్డి ఉండాలన్నారు..పట్టణాల్లో డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు.. నెలాఖరులోగా మునిసిపల్‌ఉటర్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.