జూన్‌ 15న ‘సమ్మోహనం’

SAMMOHANAM-1
SAMMOHANAM

జూన్‌ 15న ‘సమ్మోహనం’

అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కుతున్న కొత్తతరం ప్రేమ కథాచిత్రం ‘సమ్మోహనం జూన్‌ 15న విడుదల కానుంది.. సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ భామ ఆదితీరావు హైదరీ నాయికగా నటిస్తున్నారు.. శ్రీదేవి మూవీస్‌ ప్రొడక్షన్‌ నెం10గా చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాత మాట్లాడుతూ, ఫైనల్‌ షెడ్యూల్‌ని ఈనెల 21 నుంచి ఏప్రిల్‌ 3 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌, ముంబైలో తెరకెక్కిస్తామన్నారు. దాంతోషూటింగ్‌ పూర్తవుతుందని అన్నారు. ఏప్రిల్‌, మే నెలలో పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు చేస్తామన్నారు. జూన్‌ 15న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలుచేస్తున్నామన్నారు. సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రమన్నారు. దర్శకుడు మోహన్‌కృష్ణ మాట్లాడుతూ, నవతరం కథ లోరొమాన్స్‌, హాస్యం,సమ్మిళతమై ఉంటుందన్నారు. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా మొత్తం ఫీల్‌ క్యారీ అయి సమ్మోహనంగా ఉంటుందని అన్నారు.