జూన్‌ 1న వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ ట్రైలర్‌

manchu laxmi
manchu laxmi

కెరీర్‌ బిగినింగ్‌ నుంచి అవుడ్‌ ఆఫ్‌ద బాక్స్‌ ఐడియాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపున సంపాదించుకున్న మంచు లక్ష్మి ఈసారి దీక్షగా ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు.. ప్యూర్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ టీజర్‌ విడుదలై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ఆసక్తిని రాబట్టుకోగలిగింది.. ఈసినిమా ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌చేసింది చిత్రం యూనిట్‌..
ఆమె పేరుదీక్ష ఆమెకు సమస్య ఉందా.. లేక ఆమే ఒక సమస్యా.. అనే పాయింట్‌తో ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుంది.. ఈసినిమా అంటోంది చిత్రం యూనిట్‌.. జూన్‌ 1న ఈచిత్రం ట్రైలర్‌నువిడుదల చేయనునానరు. సమాజాన్ని ప్రభావితం చేసిన మహిళల సమక్షంలో ఈ ట్రైలర్‌ను లాంచ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు.. ఆమె జీవితంలో గుండెలు పగిలే సంఘటనలుంటాయి.. ప్రతిదానికి భయపడుతుంది.. భయం అంటే తెలియని దానిలా ప్రవర్తిస్తుంది. ఒక న్యాయం కోసం తను చేసే పోరాటంలో ఆమె ఒకలా ఉండదు.. ఎవరికీ తనపై అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం ఇవ్వదు.. ఆమె దీక్ష ఇలాంటి పాత్ర తెలుగు ప్రేక్షకులకుకొత్త అనుభూతులను అందిస్తాయి అనిపేర్కొంది యూనిట్‌.. కృతిప్రసాద్‌విద్యా నిర్వాణమంచు, ఆనంద్‌ సమర్పిస్తున్న ఈచిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..