జూన్‌ నెలలో రానున్న ఫ్యాషన్‌ డిజైనర్‌

fashiooer
fashiooer

జూన్‌ నెలలో రానున్న ఫ్యాషన్‌ డిజైనర్‌!

క్రియేటివ్‌ డైరెక్టర్‌ వంశీ దర్శకత్వంలో, మధుర ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి నిర్మించిన ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ చిత్రం జూన్‌ 2న విడుదల కానుంది. ముప్పై ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న లేడీస్‌ టైలర్‌ చిత్రానికి ఇది సీక్వెల్‌. సుమంత్‌ అశ్విన్‌, అనీషా ఆంబ్రోస్‌, మనాలి రాథోడ్‌, మానస హిమవర్ష హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించాయి. ఈ సంధర్భంగా మధుర శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ.. వంశీ గారు అభిమానులను, ఈ తరం యువతను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇది ఒక మ్యూజికల్‌ కామెడీ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ అన్నారు.
అప్పటి లేడీస్‌ టైలర్‌ రాజేంద్రప్రసాద్‌ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడు..? అన్న కథాంశంతో రూపొందిన ఈ
సినిమా ఆధ్యంతం కడుపుబ్బా నవ్వుకునే కామెడీతో తెరకెక్కించాలని చిత్ర దర్శకుడు వంశీ
తెలిపారు.