జూన్‌కి కాళేశ్వరం నీళ్లు

kcr
kcr

ఎస్‌ఎర్‌ఎస్‌పి పనులు పూర్తి
14.40లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి
ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు పురోగతిపై కెసిఆర్‌ సమీక్ష
హైదరాబాద్‌: ఈ ఏడాది వర్షాకాలంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి అనువుగా జూన్‌ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం,లైనింగ్‌ పనులు పూర్తి చేయాలని టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఈ వర్షాకాలంలో నీటిని ఎత్తిపోయడం ప్రారంభమవుతుందని ఆ నీటిని మిడ్‌మానేరు,లోయర్‌ మానేరు డ్యాములకు తరలిస్తామన్నారు. ఈ రెండు డ్యాముల్లో కలిపి 50 టిఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుందని, ఆ నీటితో ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వల ద్వారా అన్ని చెరువులను నింపాలని ఆదేశించారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తున్నాయి. పనులు చేయడానికి నిధులిస్తున్నాం. అయినా పంట పొలాలకు నీరందించకుంటే పాపం చేసిన వారమవుతామని సిఎం వ్యాఖ్యానించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి, ఆయకట్టు పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పి పరిధిలోని మొత్తం ఆయకట్టుకు నీరందించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూలంకశంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉందో గుర్తించి,దాన్ని అప్పటికప్పుడే పరిష్కరించారు. భూసేకరణకు, ఇతర పనులకు కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
‘గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. ఈ నీటిని ఎత్తిపోయడానికి భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నం. ఈ ఏడాది వర్షాకాలం నుంచే మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోసి మిడ్‌మానేరు,లోయర్‌ మానేరు డ్యాములకు తరలిస్తాం. అలా తరలించిన నీటిని ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వల ద్వారా అన్ని చెరువులను మళ్లించాలి. చెరువులను నింపడమే ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించాలి. దీనికోసం ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వలన్నింటినీ మరమ్మత్తు చేయాలి. కావాల్సిన చోట తూములు వెంటనే నిర్మించాలి. భూసేకరణ పూర్తి చేయాలి. రెండో ఫేజులో నిర్మించిన కాల్వలకు లైనింగ్‌ పూర్తి చేయాలి. అవసరమైతే కాల్వల క్యారీయింగ్‌ కెపాసిటీ(నీటి ప్రవాహ ఉధృతి సామర్థ్యం)ని పెంచుకోవాలి. ఎక్కడ ఏ పనిచేయాలో నిర్ణయించడానికి వెంటనే 50 మంది ఇంజనీర్లను నియమించండి. యుద్ద ప్రాతపదికన సర్వే చేసి, అంచనాలు రూపొందించాలి. కావాల్సిన నిధులు వెంటనే మంజూరు చేస్తాం. పనులు కూడా యుద్ద ప్రాతిపదికన జరగాలి. అన్ని పనులూ పూర్తి చేసి, ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షా కాలానికి ఎస్‌ఆర్‌ఎస్‌పి పరిధిలోని 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు ప్రాంతం నుంచి మొదలుకుని చివరి ఆయకట్టు కలిగిన డోర్నకల్‌,తుంగతుర్తి,భూపాలపల్లి,పెద్దపల్లి,రామగుండం నియోజకవర్గాల వరకు అన్ని దిక్కులకు నీరు అందాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన మరికొన్ని ముఖ్య విషయాలు-
-కాకతీయ కాలువ-వరద కాలువ మధ్యనున్న లక్షా 10వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేయాలి. వెంటనే ఈ పనుల కోసం సర్వే నిర్వహించి,పనులు ప్రారంభించాలి.
-ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్‌2లో అన్ని డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్‌ చేయాలి. దీనికోసం వెంటనే అంచనాలు రూపొందించి,టెండర్లు పిలవాలి. ఎండాకాలంలోపు పనులు పూర్తి కావాలి.
-ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వల పనులు చేయడానికి ఎక్కడికక్కడ ఎక%E