జులై నాటికి ఇస్రో ఎస్‌ఎస్‌ఎల్‌వి రెడీ!

shivan
shivan

ఇస్రోఛైర్మన్‌ కె.శివన్‌
బెంగళూరు: భారత అంతరిక్షపరిశోధనాసంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో కొత్త శాటిలైట్‌ ప్రనయోగవాహికను రూపొందిస్త్నుట్లు వెల్లడించింది. 72 గంటల్లోపు సిద్ధం అవుతుందని, ఈ ఎస్‌ఎస్‌ఎల్‌వి 300 నుంచి 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపించగలుగుతుందని ఇస్రోఛైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహ వాహిక నౌకపై ఉపగ్రహాలను శాస్త్రీయపరిశోధనలకు వినియోగించేందుకు వినియోగిస్తామని చెపుతున్నారు. ఈ ఎస్‌ఎస్‌ఎల్‌వి సామర్ధ్యాన్ని నిఘా ప్రయోగాలకుసైతం వినియోఇస్తామన్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌వి మొట్టమొదటి వాహికను ఈ ఏడాది జులైలోనే ప్రారంభిస్తామని, ఈ ఎస్‌ఎస్‌ఎల్‌వి 500 కిలోల పేలోడ్‌తో పనిచేస్తుందని అన్నారు. అలాగే ఆరుగురు వ్యక్తులు సైతం ప్రయాణించేవీలుంటుందని, ఇదొక సృజనాత్మక పరిశోధనలకు నిదర్శనమని అన్నారు. ఘనింధనంతో నడుస్తుందని, ఎస్‌ఎస్‌ఎల్‌వి అత్యంత చిన్నదైన, ఎంతో అందుబాటు వ్యయంతో రూపొందించిన ప్రయోగవాహికగా పనిచేస్తుందని అన్నారు. పిఎస్‌ఎల్‌వి తయారీలో పదోవంతు ఖర్చుతో ఎస్‌ఎస్‌ఎల్‌విని రూపొందించవచ్చన్నారు. చిన్న బాక్సులు పంపిణీకోసం ట్రక్కును వినియోగించగలమా అలాగే నాలుగుటన్నుల బరువు సామర్ద్యం ఉన్న వాహనాన్ని చిన్న ఉపగ్రహాలకోసం ఎలా వినియోగిస్తామని, ఎంతో వృధా ఖర్చవుతుందని అన్నారు. మనవద్ద ఎన్నో చిన్న ఉపగ్రహాలున్నాయని, ఎస్‌ఎస్‌ఎల్‌వి సాయంతోనే వాటిని ముందు ఈ ఏడాది ప్రయోగించే ప్రదర్శనకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు. కొత్త రాకెట్‌ రాకపై వ్యూహాత్మక వివ్లేషకులు స్వాగతిస్తున్నారు. సాయుధ దళాలకు ఈ తరహా ఎస్‌ఎస్‌ఎల్‌విలు ఎంతో అవసరం అవుతాయని అన్నారు. అన్ని వాతావరణపరిస్థితుల్లోను పనిచేసేవిధంగా అన్ని ప్రాంతాల్లోసైతం సెన్సార్లు పనిచేసేవిధంగా ఉంటుందని రక్షణరంగ అధ్యయనంసంస్థ సీనియర్‌ పరిశోధకులు అజ§్‌ు లెలే పేర్కొన్నారు. భారత్‌కు పొంచి ఉన్న ప్రమాదాలనేపథ్యంలోమనకు ఈ తరహా శాటిలైట్‌ ప్రయోగ నౌకలు అత్యవసరమని, మరిన్ని ఉపగ్రహాలను ప్రయోగించేందుకు కృషిజరుగుతున్ననేపథ్యంలో చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఈ ఎస్‌ఎస్‌ఎల్‌విలు ఎంతో మేలుచేస్తాయని పేర్కొన్నారు.