జీవో 64ను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం

Career
Career

హైద‌రాబాద్ః వ్యవసాయశాఖలో కొత్త పోస్టింగులు, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన జీవో 64ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 27న జారీ చేసిన జీవో 64పై ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేశారు. ఐసీఏఆర్‌ గుర్తింపు పొందిన వ్యవసాయ కళాశాలలు, వర్సిటీల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే ఇప్పటి వరకు వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ఇచ్చేవారు. అయితే.. జీవో 64 ద్వారా యూజీసీ గ్రాంటు పొందిన కళాశాలల్లో ఏజీ బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకూ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనిని ఎన్జీ రంగా వర్సిటీ విద్యార్థులు వ్యతిరేకించారు.