జీవిత సత్యాలు.. జీవన సూత్రాలు…

Hansika
Hansika

జీవిత సత్యాలు.. జీవన సూత్రాలు…

‘ఇతరులలో ఉత్తమతను గుర్తించగల గుణాన్ని అలవర్చుకునే కుటుంబసభ్యులు, ఉపరితలకంటే కింద ఉన్నవారిని చూడగలిగే సహనం కలిగి చికాకుతనం లేని సభ్యులు, మనుషులు సరిగ్గా అర్థం చేసుకోబడినప్పుడు వారికి సందేహలాభాన్ని ఇవ్వగల సభ్యులు, ఇతరులలో తప్పులు వెతకడంలో ఆనందాన్ని పొందకుండా వారికి సహాయం చేయగలవారు చెడును చెప్పడంలో ఆనందానుభూతిని పొందకుండా వాటిని మర్చిపోయే సభ్యులు, మంచిని భూతద్దంలో ఆకారాన్ని పెంచిచూచి మంచి ద్వారా చెడును అధిగమించే వ్యక్తులు వీరే నిజంగా ఆనందంతో నిండిన కుటుంబ సభ్యులని ప్రముఖ మనోనిపుణులు అనానిమన్‌ చెప్పారు. ర ఇతరులు మీపట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండేలా ప్రయత్నించండి.

చిన్నచిన్న విషయాలు గురించి గొప్పగా ఆలోచించండి. జీవితంలో ఎలా సర్దుకుపోవాలో తెలుసుకోండి. హెచ్చుతగ్గులు లేని భావనను కలిగి ఉండండి. ఇతరుల అదుపులో ఉండకండి. గొప్ప కోరికలను కలిగి ఉండండి. మీరు ఏపనికి తగుదురో ఆ పనిని చేయండి. మంచిని వెతికి దానికి కట్టుబడి ఉండండి. చాలా పదునుగా ఉండండి. పైఎనిమిది గుణగణాలను అలవర్చుకోండి. ర ఏపని ఎలా చేయాలో తెలిసి చాలా బాగా చేస్తున్నప్పుడు ఎలాంటి దిగులును కలిగి ఉండకండి. గెలుపు నిర్దిష్టతపౖౖె ఆధారపడి ఉన్నప్పుడు తొందరపాటును కలిగి ఉండకండి.

ప్రయత్నించకుండా అసంభవమైనదన్న సంగతిని విశ్వసించకండి. మంచి ఉద్దేశ్యం మాత్రం చాలని ఎప్పుడూ ఊహించకండి. మీవద్ద పూర్తి వివరాలు వాస్తవాలు లేనంతవరకు మీ స్నేహితుడి గురించి చెడు ఆలోచనను రానివ్వకండి. ఎవరిపట్ల దురుసుతనాన్ని ప్రదర్శించకండి. ర మాట్లాడే ముందు వినండి. రాసే ముందు ఆలోచించండి. ఖర్చు చేసేముందు సంపాదించండి. పెట్టుబడి పెట్టేముందు ఆరాతీయండి. విమర్శించేముందు నిదానించండి. ప్రార్ధించే ముందు క్షమించండి. పనిని వదిలే ముందు ప్రయత్నించండి. పదవీవిరమణ చేసేముందు దానం చేయండి. మీ స్నేహబంధాలను బలపరుచుకునేందుకు తోడ్పడగలవ్ఞ. ర బాధ్యతలను నవ్ఞ్వతూ స్వీకరించండి. కొత్తభావాలను ఆహ్వానిస్తారు. మంచినడత కల్గియుండాలి. లక్ష్యాలను నిర్ణయించుటకు పనిని ప్రారంభించండి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగివ్ఞండాలి. ఉత్సాహపు విలువ తెలుసుకోండి. కోపతాపాలు హద్దులోకి రానివ్వకండి. ఆత్మవిమర్శను మానుకోండి. గృహానికి అందం సామరస్యం, భద్రతవిశ్వాసం, ఆనందం, ప్రేమ, సమృద్ధి బిడ్డలు నియమం సేవ, సౌకర్యం తృప్తిపడే ఉత్సాహాలు, దైవభక్తే ఇంటికి కిరీటం. క్రమం ఇంటికి అందం, అతిధ్యమే ఇంటి గొప్పదనం, సంతృప్తే ఇంటికి వరప్రసాదం. ర ఉద్దేశపూర్వకంగా ప్రణాళికలను తయారు చేసుకొండి. ప్రార్ధన పూర్వకంగా ప్రణాళికలను తయారు చేసుకొండి. సక్రమమైన ఆలోచనలతో ముందుకు సాగండి. విడవకుండా సాధిస్తూ రండి. శ్రేష్టతను సాధించేందుకు తోడ్పడగలవ్ఞ. ర చేస్తున్న పనిని ఆనందంగా చేయడానికి కావలిసినంత ఆరోగ్యం, అవసరాలకు కావలిసినంత సంపద, కష్టాలతో పోరాడి గట్టెకడానికి కావలిసినంత బలం, చేసిన తప్పులను ఒప్పుకొని వాటిని వదులు కోవడానికి కావలిసినంత దయ, మంచిని సాధిచేంతవరకు కష్టపడడానికి కావలిసినంత సహనం, మీ పొరుగువారిలో మంచిని చూడడానికి కావలిసినంత ఉదారగుణం ఇతరులకు ఉపయోగపడడానికి, సహాయపడడానికి కావలిసినంత ప్రేమ, భగవద్‌ విషయాలను నిజం చేయడానికి కావలిసినంత నమ్మకం భవిష్యత్తుకు సంబంధించిన అన్ని భయాలను పారద్రోలేందుకు కావలిసిన ఆశ ఇవే సంతృప్తికరమైన జీవితపు తొమ్మిది సూత్రాలు. మీ పనిని మీరు ఎంత బాగా చేయగలరో అంత బాగా చేయడం, మీతోటివారితో న్యాయసమ్మతంగా నడుచుకోవడం తగ్గించి పనులను చేపట్టడం, మీరు వాచా, కర్మణా అతిఉత్తమమైన దానిని ఆలోచించడం, దృఢ నిశ్చయముతో, నవ్ఞ్వ ముఖంతో సమస్యలతో పోరాడడం, మీరు వినయ విధేేయతలతో సేవ చేస్తూ, పనులను శ్రద్ధచేయగా చేయడం, వీటిని మీరు అనుసరిస్తే గెలుపు మా చెంతే ఉంటుంది. ర అత్యంత స్వార్ధపూరితమైన మాట ‘నేను దానిని మానండి.

అత్యంతతృప్తికరమైన మాట ‘మనం అని వాడండి. అత్యంత హానికరమైన మాట ‘అహంకారం దాన్ని వదలండి. అత్యంత శక్తికరమైనమాట జ్ఞానం దాన్ని సంపాదంచుకొండి. అత్యంత నిశ్చయమైనమాట ‘విశ్వాసం దానిని పొందండి. అత్యంత స్నేహశీలమైన మాట చిరునవ్ఞ్వ దానిని ఉంచుకొండి. అత్యంత ఆహ్లాదకరమైనమాట ‘ప్రేమ దానిలోని విలువను పరిగణించండి. అత్యంత ప్రసంశనీయమైన మాట విజయం దాన్ని సాధించండి. ర నిన్నటి తప్పులను సరిదిద్దుకోలేని మనిషి, గెలుపును సాధించిన ప్రతిమనిషికి సహాయం చేసేవారుంటారని భావించే మనిషి, తన మనసును మార్చుకునే ధైర్యంలేని మనిషి, తన అదృష్టం కోసం ఎల్లప్పుడూ ఎదురు చూసే వ్యక్తి అది అయ్యేపని కాదు అన్నమాటను తన నాలిక చివర ఉంటుందనుకునే వ్యక్తి, ఏమాత్రం విలువలేని వాటిపై డబ్బును నీళ్లలాగా ఖర్చు చేసే వ్యక్తి తాను భగవంతుడు సహాయం లేకుండా నెగ్గుకొని రాగలను అని భావించడమైనదిగా ఉండకండి.
అత్యంత ప్రాముఖ్యమైనఆరు మాటలను మీరు జీవితంలో అనుసరించండి.

”నేను తప్పు చేసానని అంగీకరిస్తున్నాను.
ఏడు ముఖ్యమైన మాటలు ‘నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను.
నాలుగు ప్రధానమైన పదాలు బహుశానీదే ఒప్పుకావచ్చు. మూడు ముఖ్యమైన మాటలు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను
రెండు ముఖ్యమైన మాటలు ‘మీకువందనాలు ఒకేఒక ప్రధానమైనమాట ‘దయచేసి అత్యంత అప్రధానమైనమాట ‘నేను.
పిల్లలకు మీ ప్రేమను వారికి ఇవ్వండి అంతేకానీ మీ ఆలోచనలను కాదు వారి ఆలోచనలు వారికి ఉండడమే అందుకు కారణం. మీరు వారి శరీరాలను అదుపులో ఉంచవచ్చు. అంతేకాని వారి ఆత్మలను కాదు. కారణం వారి ఆత్మలు రేపటి కోరికల తో నిండి ఉంటాయి. వారి కోరికలను మీకలలో కూడా చూడలేరు. వారిలాగా ఉండ డానికి ప్రయత్నించండి.

అంతేగాని మీలాగ వారు ఉండాలని కోరికుంటే కారణం జీవితం వెనక్కుపోదు. మీరు వారి పాలిట ధనస్సులు. ర మీ పిల్లలు అక్కడి నుండి పంపబడే సజీవ బాణాల లాంటివారు. మీ ఆలోచల్ని గమనిస్తూవ్ఞంటే అవే మీమాటలవ్ఞతాయి. మీమాటల్ని గమనిస్తూ వ్ఞంటే అవి నీచేతలవ్ఞతాయి. మీచేతల్ని గమనిస్తూ వ్ఞండు అవే మీ అలవాటులవ్ఞతాయి. మీ అలవాట్లను గమనిస్తూ ఉంటే అదే శీలం అవుతుంది. మీ శీలాన్ని గమనిస్తూ వుంటే అదే మీ భవిష్యత్తు. మీ ఆలోచనపట్ల జాగ్రత్త వహించండి. మీ ఆలోచనలను పవిత్రంగా వ్ఞంచుకొండి. మీమాటలను నిజమైన వాటిగా ఉండనివ్వండి.
మీ పనులు స్వార్ధరహితంగా ఉండేలా చూడండి. అప్పుడు మీరు అద్భుతాలను చూడగలరు.

మీ నిజజీవితం ఆనందంతో పొంగిపొర్లుతుంది. తీర్పు యిచ్చేముందు వినగలిగితే మాట్లాడే ముందు ఆలోచించితే మీనాలుకకు కళ్లేం వేయగలిగితే చాడీలకు చెవి వొగ ్గకుంగే చెడు ఫిర్యాదులను నమ్మకుంటే బాధలో ఉన్నవారిని ఆదుకుంటే అందరిపట్ల ఓపికను ప్రదర్శించగలిగతే అందరికి మంచి చేయగలిగితే అందరిని గౌరవించగలిగితే మీరు అసలు బాధపడవలిసిన అవసరం ఉండదు. ఇతరుల తగాదాల్లో ఇరుక్కొని కష్టాలుకొని తెచ్చుకున్నప్పుడు గట్టిగా వుండు, ఇతరులు పుకార్లు వ్యాపింపచేస్తున్నప్పుడు మూగగా వ్ఞండు. ఇతర వ్యర్ధప్రసంగాలు చేస్తున్నప్పుడు చెవిటిగా వ్ఞండు, అదృష్టాన్ని సాధించేందుకు ఇతరులు నిరీక్షిస్తున్నప్పుడు పని చేస్తూ వ్ఞండు, ఇతరుల పైకిలాగే వారి కోసం వేటాడుతున్నప్పుడు నీవ్ఞ నెట్టుకువెళ్ళు, ఇతరులు కలహా ప్రియులుగా, వివాదాస్పదులుగా ఉన్నప్పుడు, నీవ్ఞ సహనబుద్ధితో వ్ఞండు, ఇతరులు తప్పులు చేసి పట్టుబడినప్పుడు నీవ్ఞ ఉదారంగా వుండు.

వీటిని హితకరమైనవిగా భావించాలి. ఎప్పుడూ చిరునవ్వులను చిందిస్తూ ఉండండి. ఇతరులు ఏమి చెబుతున్నారో దాన్ని శ్రద్ధగా వినండి. అవతలి వ్యక్తికి ప్రియమైన విషయాన్ని ఎన్నుకొని ఆవిషయంగానే మాట్లాడండి. పొగుడుతున్నప్పుడు చాలా ధారాళంగా ఉండండి. ఎప్పుడూ విమర్శించకండి. ఇచ్చిన బహుమతి లేదా చెప్పిన మంచిమాటను స్వీకరిస్తున్న దానికి ధన్యవాదాలు తప్పక తెలియజేయండి. మీ గురించి చాలా తక్కువగా మాట్లాడండి. ఇంపైన విధంగా వ్యవహరించండి. అవతలివ్యక్తి పేరును సరిగ్గా తెలుసుకుని గుర్తించుకోండి.

– సత్యం