జీవితాశయం నెరవేరిందన్న ముఠాగోపాల్‌

 

MUTA Gopal
MUTA Gopal

విద్యానగర్‌ : ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపిస్తానని ముషీరాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ స్పష్టం చేశారు. కెసిఆర్‌ సంక్షేమ పథకాలే గెలిపించాయని, తన గెలుపుకు సహకరించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠాజైసింహ, ఆర్‌, మోజేస్‌, ప్రభాకర్‌, శ్యాంయాదవ్‌ తదితరులతో కలసి టిఆర్‌ఎస్‌ నుంచి నూతనంగా ఎన్నికైన ముఠాగోపాల్‌ మాట్లాడారు. తన జీవితాశాయాన్ని నెరవేర్చిన ముషీరాబాద్‌ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పానిని చెప్పారు. ప్రజలంతా అభివృద్ధిని కోరుతున్నారని, అందుకే సంక్షేమానికి పెద్దపీఠ వేసిన కెసిఆర్‌ను, టిఆర్‌ఎస్‌ను ఏ పార్టీకి అందనంత ఎత్తులో నిలిపారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిలన్ని నెరవేర్చుతామని, అన్ని బస్తీల్లోను ఇంటింటికి నల్లా ఉండేలా చూస్తామన్నారు. హోంమంత్రి నాయిని, కార్పొరేటర్లు, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ముషీరాబాద్‌ ప్రజలు ఆశీర్వాదాలే తనను గెలిపించాయని, సిఎం కెసిఆర్‌ చెప్పినట్టుగా నియోజకవర్గ పురోభివృద్ధికి కృషిచేస్తాన్నారు. ఈ నెల 26 నుంచి జరగే ఓటర్లు నమోదుకు మరింత ప్రచారం కల్పించి అందరి పేర్లు జాబితాలో ఉండేలా చేస్తానని గోపాల్‌ వెల్లడించారు. కాగా యువత, అన్ని వర్గాల ప్రజలు అండగా ఉన్నందునే ముఠాగోపాల్‌ ఆరోగ్యంపై పుకార్లు, పుట్టించినా తన తండ్రి గెలిచారని ముఠాజైసింహ వ్యాఖ్యనించారు.