జీవితకాల గరిష్టస్థాయికి విదేశీ కరెన్సీ ఖజానా

forx
forx

జీవితకాల గరిష్టస్థాయికి విదేశీ కరెన్సీ ఖజానా

ముంబయి, మే 15: విదేశీ కరెన్సీ నిల్వలు మరోసారి జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. మే 5వ తేదీతో ముగిసిన వారంలో భారత్‌ విదేశీ కరెన్సీ నిల్వలు 375.71 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2.985 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అంతకుముందు వారంలో కూడా 372.73 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీకరెన్సీ ఆస్తులపరంగాచూస్తే 2.474 బిలియన్‌ డాలర్లకు పెరిగి 351.53 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆర్‌బిఐ వెల్లడించింది. డాలర్‌ కరెన్సీ విలువల్లో విదేశీ కరెన్సీ ఆస్తులు అంటే డాలరేతర కరెన్సీలు అంటేయూరో, పౌండ్‌, యెన్‌ వంటి వాటి హెచ్చుతగ్గుల్లో మార్పులను కరెన్సీ ఆస్తులుగా పరిగణిస్తారు.

బంగారం నిల్వలుమాత్రం 569.9 మిలియన్‌ డాలర్లు పెరిగి 20,438 బిలియన్‌ డాలర్ల వద్దనే నిలిచింది. ఐఎంఎఫ్‌ వద్ద భారత్‌ ఎస్‌డిఆర్‌ల స్థాయి 0.4 మిలియన్‌ డాలర్లు తగ్గి 1.459 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్‌ వద్ద భారత్‌ నిల్వస్థాయి కూడా 58.4 మిలియన్‌ డాలర్లు తగ్గి 2.288 బిలియన్‌ డాలర్లుగా ఉందని ఆర్‌బిఐ ప్రకటించింది. ఇక వివిధ కరెన్సీల మారకం రేట్లను పరిశీలిస్తే డాలర్‌ విలువలపరంగా కొనుగోళ్లు 65.95గాఉన్నాయి. అమ్మకం62.75గా ఉన్నాయి. పౌండ్‌ జిబిపి 84.75అయితే 80.55 విక్రయాలు న్నాయి.యూరోధరలు71.70రూపాయలు, 68.15 రూపాయలు స్విస్‌ ఫ్రాంక్‌ 65.75కొనుగోళ్లు, 60.90 అమ్మకంగా సాగుతోంది. ఆస్ట్రేలియన్‌ డాలర్‌ 48.95 రూపాయలు, 46 రూపాయలు, కెనడా డాలర్‌48.30రూపాయలు, 45.40 రూపా యలు, సింగపూర్‌ డాలర్‌ 47.05 రూపాయలు, 43.60 రూపాయలు క్రయవిక్రయాలు జరుగుతు న్నాయి. ఇక చైనా యువాన్‌ 9.95రూపాయలు, 8.25 రూపాయలు, హాంకాంగ్‌డాలర్‌ రూ.8.50, రూ.7.70లుగాను, జపాన్‌ వంద యెన్‌లు రూ.58.95లు, 54.75లుగా ఉన్నాయి.

మలేసి యా రింగిట్‌ 15.50లు, 14.10 రూపాయలుగా చెలామణి అవుతున్నాయి. న్యూజిలాండ్‌ డాలర్‌ 45.85, 41.15 రూపాయలుగా ఉంది. థా§్‌ు బాత్‌ వంద బాత్‌లు 196.25 రూపాయలు, విక్ర యం 176.75 రూపాయలుగా ఉంది. బహ్రెయిన్‌ దినార్‌లు 181.55రూపాయలు, 159.30 రూపా యలుగా ఉన్నాయి. ఇక కువైట్‌ దీనార్‌ 217.10 రూపాయలు, 175రూపాయలుగా కొనసాగుతున్నా యి. ఒమని రియాల్‌ 177.75రూపాయలు, 155.95 రూపాయలుగా ఉన్నాయి. ఖతార్‌ రియా ల్‌ 19.10 రూపాయలు, 16.40 రూపాయలుగా ఉన్నాయి. సౌదీ రియాల్‌ 18.75 రూపా యలు, 15.90 రూపాయలుగాను, దక్షిణాఫ్రికా ర్యాండ్‌ (జార్‌)5.15 రూపాయలు, రూ.4.30గా ఉన్నాయి. స్వీడన్‌క్రోనర్‌ కరెన్సీ భారత్‌ పరంగా రూ.7.90లు, రూ.6.50లుగా చెలామణిలో ఉన్నట్లు తేలింది.