జీవితంపై విరక్తి చెంది వృద్ధ దంప‌తులు ఆత్మ‌హ‌త్య

sucide
sucide

క‌రీంన‌గ‌ర్ః రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన వృద్ధదంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. గ్రామానికి చెందిన వెదిర ముత్తయ్య(95), అతని భార్య లచ్చవ్వ(90) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వెదిర ముత్తయ్య, లచ్చవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఎవరి కుటుంబ సభ్యులతో వారు వేరుగా ఉంటున్నారు. వయ‌సు మీదపడి సొంత పనులు చేసుకునేందుకు ఆరోగ్యం సహకరించక పోవడం, మరోవైపు ఇద్దరు కొడుకులు వేరుగా ఉండడంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగారు. ఇద్దరు ఎంతకీ లేవకపోవడంతో పక్కింటివారు తలుపు తెరిచి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నారు.  స్థానికుల స‌మాచారం మేరకు సంఘ‌ట‌న స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.