జీవన విధానమే భద్రతకు సోపానం

TRULY
TRULY

జీవన విధానమే భద్రతకు సోపానం

పెద్దలు డబ్బులివ్వకపోయినా జబ్బులిచ్చిపోతారన్న సామెత ఒకటుంది. వంశపారంపర్యంగా సంక్రమించే జబ్బులు చాలా ఉన్నాయి. ఆయా వ్యాధులకు వంశపారంపర్యంగా వచ్చే లక్షణం ఉంటే ముందు నుండే ఆ వ్యాధి విషయంలో అతిజాగ్రత్తగా ఉండండి. ్య పొల్యూషన్‌ లేని ప్రాంతంలో నివసించటానికి ప్రయత్నించండి. త్రాగునీటి విషయంలో అమిత జాగ్రత్తగా ఉండాలి. కాలుష్యనీరు,కాలుష్య వాతావరణం మన ఆయుష్షుని బాగా కృంగదీస్తుంది. రకరకాల వ్యాధుల్ని మనకు అంటకడతాయి.

మీ ఆలోచనలు సమస్యలపై కేంద్రీకృతం కాకూడదు. ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటన్నదే మీరు ఎప్పుడూ ఆలోచించాలి. పాజిటివ్‌ ఆలో చించేవారు ఆయుష్షు మరో పదేళ్ళు పెరుగుతుందని పరిశోధనలో వెల్లడించారు. జీవితంలో జయాపజయాలను స్పోర్టివ్‌గా తీసుకోవాలి. ఎదురుదెబ్బల్ని అనుభవాలుగా మలచుకోవాలి. భవిష్యత్‌ గురించి చింతించినా ఒరిగేది జరిగేది శూన్యం.

తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం మనకు చక్కని పోషకవిలువల్ని అందించాలి. పండ్లు, కూరగాయలు నిత్యం తినేవార్ని ఎన్నో రకాల డీజనరేటివ్‌ వ్యాధుల నుండి కాపాడుతాయని వైద్యపరిశోధనలు వెల్లడించాయి. నిత్యం మీరు తినే ఆహారంతో పాటుగా పెరుగు, ఉసిరి, మొలకెత్తిన విత్తనాలు, యాపిల్‌, తేనె, బాదంపప్పు, సోయాబీన్స్‌, నిమ్మకాయ, వెల్లుల్లి, నీరుల్లి, టమాట, విధిగా ఉండేలా జాగ్రత్తపడండి.

లిఫ్ట్‌ ఉన్నా లేకున్నా మెట్లు ఎక్కే అవకాశం వస్తే కష్టం అనిపించినా కాస్తంత ఆయాసం వచ్చినా మెట్టెక్కెందుకే ప్రయత్నించండి. ఒక గంట మీరు నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చవ్ఞతాయో 15నిమిషాలు మెట్లెక్కి దిగితే అన్ని కేలరీలు ఖర్చవుతాయి. ఈ వ్యాయామం మీ హార్టకు ఎంతో ఆరోగ్యదాయకం.

మీరు ఎంత బిజీగున్నా మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో నిత్యం ఎంతో కొంత సమయం గడపండి. గడిపినంత సేపూ వారికి ఆనందాన్ని పంచి ఇవ్వండి. మిమ్మల్ని అభిమానించే వారితో, మిత్రులతో ప్రతిరోజూ ఎంతో కొంత సమయం గడపండి.

బ్రేక్‌ఫాస్ట్‌ను అశ్రద్ధ చేయకండి
రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ చేసేవారిలో 44% ఒబేసిటీ, ఓవర్‌వెయిట్‌ లేకపోవడం, 41% మందిలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ డెవలప్‌ కాకపోడాన్ని పరిశోధకులు వెల్లడించారు. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ పెరిగిందంటే ఆ వ్యక్తి మధుమేహంతో బాధపడకు తప్పదు. ్య ప్రతిరోజూ ప్రశాంతంగా మీకు నచ్చిన మీరు మెచ్చిన సాహిత్యంతో కూడిన ఓ పుస్తకం ఓ అరగంట చదవండి అది మీ హార్ట్‌రేట్‌ను తగ్గిస్తుంది. తత్ఫలితంగా గుండెకు మంచి ప్రశాంతత లభిస్తుంది. అది ఆయుష్‌ వర్థకంగా పనిచేస్తుంది. మనసుకు నచ్చే రీడింగ్‌ స్ట్రెస్‌ నుండి దూరం చేస్తుంది.

రోజుకు 3లీటర్ల నీరు మీరు దప్పిక అయినా కాకున్నా, మీ నోరుమండినా మండకున్నా విధిగా త్రాగండి. ఈ ఒక్క అలవాటు మీకు హార్ట్‌ డిసీజెస్‌ సంభవించే అవకాశాన్ని 60% తగ్గిస్తుందని తెలియవచ్చింది.

వారానికి రెండు రోజులయినా ఫిష్‌ తినాలి. ఒకవేళ మీరు స్ట్రిక్ట్‌ వెజిటేరియన్‌ అయితే మీ డాక్టర్‌ సూచన మేరిఫిష్‌ ఆయిల్స్‌ వారానికి రెండుసార్లయినా ఉపయోగించండి. వైద్యుని సలహా లేకుండా మీ ఇష్టాను సారం మందులుకొని వాడకండి. మీ మోర్నింగ్‌ వాక్‌ అయిపోయాక 90 నిముషాలలోపు విధిగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయండి.

ఇంటిని, వంటింటిని, సింక్స్‌, టా§్‌ులెట్స్‌, బాత్‌రూమ్స్‌ వీటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే అంత మంచిది. యాంటీ బ్యాక్టీరియల్‌ క్లీనింగ్‌ లిక్విడ్స్‌ ఉపయోగించి ఇంటిని పరిశుభ్రం చేయండి. డస్ట్‌లేకుండా చూడండి. వాక్యూమ్‌ క్లీనర్‌ ఉపయోగించండి. ఆస్త్మా, ఎలర్జీ, బ్రాంకైటిస్‌ వంటి వ్యాధులకు ఇంట్లో పేరుకున్న దుమ్మూధూళే కారణం.

భగవంతుని పట్ల విశ్వాసంతో ఉన్నవాళ్ళు, ప్రార్థనలు, పూజలు, భోజనలు, ఆరాధనలు చేసేవారు, మతపరమైన విశ్వాసాలు గలవారు ఇవి లేనివారికన్నా ఎక్కువకాలం ఆరోగ్యవంతంగా జీవించినట్లు తెలుస్తుంది. ప్రార్థన మనిషి జీవితానికి ఆరోగ్యవంతమైన మానసిక వ్యాయామం.

మీకోపం మీ ఆరోగ్యానికి మాత్రం కావాలసినంత హాని చేస్తుంది. మీ ఆయుష్షును హరిస్తుంది. కోపంగా చెప్పాలనుకున్నదేదో ప్రశాంతంగానే చెప్పండి అంటారు సైంటిస్ట్‌లు. డీప్‌ బ్రీతింగ్‌ చేయండి. ప్రాణాయామం చేయండి. నవ్వుమన రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది.

పెద్ద వయసువారు శరీరానికి అవసరం అయిన కెలరీలను సాలిడ్‌ డైట్‌రూపంలో లేదా లిక్విడ్‌ డైట్‌ రూపంలో అంటే జ్యూస్‌లు, జావలు ఇలాంటివి అధికంగా తీసుకుంటే అవి త్వరగా జీర్ణం అవుతాయి. వయసు పెరిగే కొద్దీ సాలిడ్‌ ఫుడ్‌ తగ్గించి లిక్విడ్‌ ఫుడ్‌ను పెంచుకోండి.

మీ వయసు 45దాటాక వైద్యుని సలహా మేర విటమిన్‌డి సప్లి మెంట్స్‌ తీసుకోవడం ఉత్తమం. కాల్షియం బాటలో అబ్జార్బ్‌ అయ్యి ఆస్టియోపోరోసిస్‌ అన్న ఎముకలకు సంబంధించిన వ్యాధి రాకుండా ఉరడాలంటే విటమిన్‌డి అత్యవసరం.

ఆహారాలలో ఏ ఆహారం అయినా మీకు అలర్జీ ఉంటే…ఎట్టి పరిస్థితులలో ఆ ఆహారం తీసుకోకండి. జీర్ణపరంగా ఇబ్బందులుంటే ప్రతిసారీ భోజనానంతరం ఒక గ్లాస్‌ వేడినీరు తాగడం అలవరుచుకోండి. ్య ఉన్నదానితో సంతృప్తికరంగా జీవించడం అలవరుచుకోండి. ఈ తృప్తి మీ మనసును ఆందోళనారహితంగా చేస్తుంది. ఇంటిని అందంగా, ఆహ్లాదకరంగా, సుందరంగా తీర్చిదిద్దుకోండి. ఈ ప్రభావం మీ మూడ్‌పై పనిచేస్తుంది.

నిత్యం విటమిన్‌ ‘ఇ అధికంగా గల ఆహారాలను విధిగా తినడం అలవరచుకోండి. వెజిటబుల్‌ ఆయిల్స్‌ గింజధాన్యాలు, ఆకుకూరలు, పచ్చని కూరగాయలు విటమిన్‌ ఇ సమృద్ధిగా లభిస్తుంది. కంటిలో కేటరాక్టు రానీయదు. పలురకాల కేన్సర్‌లకు నిరోధిస్తుంది. హృద్రోగాల నుండి రక్షిస్తుంది.

వర్రీని తగ్గించుకోండి. మనం ఊహించేవి ఏమి జరగవు. కనుక ఏదో జరిగిపోతుందని ఊహించుకుని వర్రీ కాకండి. వృద్ధాప్యం గురించి భయ పడకండి. హుషారుగా, చలాకీగా ఉండేందుకు ప్రయత్నించండి.

రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. మనం పీల్చేగాలి విషయుక్తంగా మారిపోతుంది. రోజు మొత్తంలో ఎక్కువ సమయం మీరు గడిపే బెడ్‌రూమ్‌లో అయితే ఎయిర్‌ ఫ్యూరిఫయర్స్‌ను వాడండి. ఆరోగ్యకరమైన గాలిని పీల్చండి. మీ ఆరోగ్యాన్ని పెంపు చేసుకోండి.

చాక్లెట్‌లో ప్రధానంగా ఉండే కోకోవా హార్ట్‌ డిసీజెస్‌ రాకుండా కాపాడుతుందన్న నిజం 15సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన తరువాత డచ్‌ సైంటిస్టులు వెల్లడించారు.

అయినదాన్నీ, కానిదాన్ని అవసరం అయినదాన్నీ లేనిదాన్నీ, చిన్న చిన్న విషయాలను పనికివచ్చే విషయాలను, పనికిమాలిన విషయాలను, అనవసరంగా బుర్రలోకెక్కించుకుని, గోరంతను కొండంతగా చేసుకుంటూ ఆవేశానికి, ఆత్రురతకు, అవివేకానికి గురైతే ఆయుష్షును హరించేస్తుంది. ఆరోగ్యాన్ని మింగేస్తుంది. ఆరోగ్యాన్ని మింగేస్తుంది.