జీర్ణించుకోలేకపోతున్నారట..

KEERTI SURESH REDDY1
KEERTI SURESH REDDY

జీర్ణించుకోలేకపోతున్నారట..

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే కీర్తి సురేష్‌ టాప్‌హీరోయిన్‌ పొజిషల్‌లో కూర్చుంది.. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడ కీర్తికి మంచి ఫాలోయింగ్‌ వచ్చేయ్యడమే తరువు దర్శక,నిర్మాతలు కీర్తి ఇంటిముందు క్యూ కట్టేసి తమ సినిమాల్లో అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారట.. ఇక కీర్తి సురేష్‌ కూడ వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ సినిమాలమీద సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయ్యింది.. ప్రస్తుతానికి కీర్తి సురేష్‌ చేతిలో తెలుగు, తమిళంలో చాలా సినిమాలే ఉన్నాయి.
తెలుగులో పవన్‌కల్యాణ్‌ సరసన, మహానటి సావిత్రి టైటిల్‌రోల్‌ చేస్తున్న ఈమె తమిళంలోనూ సూర్యతో తానా సెరేంద్ర కూట్టం, విక్రమ్‌తో సామి2, విశాల్‌తో శాండా కోజీ 2, చిత్రాల్లో కూడ లీడ్‌ రోల్స్‌ చేస్తుంది.. కీర్తి నటించే సినిమాలన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలు అలాగే స్టార్‌ హీరోల సినిమాలే.. మరి కీర్తి సినిమాలన్నీ షూటింగ్‌ దశలోనే ఉన్న సినిమాలు, ఒకేసారి ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయలేక నానా రకాల ఇబ్బందులు పడటమే కాదు నిర్మాతలను కూడ ఇబ్బంది పెట్టేస్తోందట.