జీపుతో ఉడాయించిన వ్యక్తి అరెస్ట్‌

Arrested 1
Arrested

సూర్యాపేట: ఆదివారం పోలీస్‌ జీపును అపహరించిన విషయం విదితమే. కాగా 24గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. సూర్యాపేట రూరల్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి ఆత్మకూర్‌(ఎస్‌) మండల పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన జీపును కోన్నాళ్లుగా వాడుతున్నారు. శనివారం రాత్రి ఓ జిమ్‌కు వెళ్లారు. సీఐ జిమ్‌లోకి వెళ్లగానే జీపు డ్రైవర్‌ సైదులు వద్దకు వచ్చి తిరుపతి అనే యువకుడు సీఐ సార్‌ జీపు పక్కకు పెట్టమన్నారంటూ జీపు తాళాలు తీసుకున్నాడు. కొద్దీ సేపటి తర్వాత జీపుతో ఉడాయించాడు.