జీఎస్టీ లో రాష్ట్రాల నుండి వచ్చే ప్రతిపాదనలు చర్చకు రావడంలేదు

yanamala
yanamala

అమరావతి: జీఎస్టీపై ఏపీ అభ్యంతరాలను సమావేశంలో చెప్పామని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. జీఎస్టీ మండలి సమావేశం అజెండా ఖరారు చేయడంలో రాష్ట్రాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం అనుకున్న వస్తువులనే కౌన్సిల్ సమావేశంలో తీసుకొస్తున్నారని, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చకు రావడం లేదని యనమల ఆరోపించారు. రియల్ ఎస్టేట్‌కు సంబంధించి సమావేశంలో చర్చ జరిగిందని, వ్యాపారులకు రిజిస్ట్రేషన్ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుందని యనమల రామకృష్ణుడు చెప్పారు.