జీఎస్టీ ప‌రిధిలో చ‌మురు ధ‌ర‌లు

Dharmendra Pradhan
Dharmendra Pradhan

న్యూఢిల్లీ : పెట్రోలియం ఉత్పత్తులను త్వరలోనే జిఎస్టీ పరిథిలోకి వస్తాయన్న ఆశాభావాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం వ్యక్తం చేశారు. ”పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టిలో చేర్చాలని జిఎస్‌టి మండలిని కోరుతున్నాను. దీని వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సహేతుకమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి.” అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడల్లా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి వినియోగదారునికి భారమవుతున్నాయన్నారు. పెట్రోల్‌ ధరలు నాలుగేళ్ళ గరిష్టానికి పెరిగిన ఒక రోజు తరువాత కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశ రాజధాని నగరంలో ఆదివారం నాటికి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.73.73కు, , డీజిల్‌ ధర రూ.64.58కు చేరుకున్నాయి.