జీఎస్టీ ప‌రిధిలో ఇంద‌న‌ ధ‌ర‌లు

Dharmendra pradhan
Dharmendra pradhan

న్యూఢిల్లీ: పెట్రో డిసీల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‌‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. త్వరలో ప్రధాని నరేంద్రమోదీ ఒడిశా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన ఝర్సుగూడ వచ్చారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ… ‘‘పెట్రోల్, డీజిల్‌ జీఎస్టీ పరిధిలోకి రావాల్సిందేనని భావిస్తున్నాను. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే అధికారమే ఎక్కువ..’’ అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కోరారు. కొన్ని నెలల క్రితమే పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందన్నారు.