జీఎస్టీపై రాహుల్‌ వ్యాఖ్యలు

Rahul Gandhi 12111111
Rahul gandhi

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రాగానే వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని మారస్తామని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. తాము అధికారంలో వస్తే జీఎస్టీలో ఐదు స్లాబులు ఉండవన్నారు. జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌ అని రాహుల్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో మహిళ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోందని పేర్కొన్నారు.