జీఈఎస్‌లో నారీమ‌ణుల అభిప్రాయాలు

GES
GES

హైద‌రాబాద్ః గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ రెండో రోజు సదస్సులు మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా సాగుతున్నాయి. సదస్సులో పాల్గొన్న పలువురు మహిళా దిగ్గజాలు, ఈ ప్రపంచంలో అన్ని రంగాల్లో పురుషులతో మహిళలు సమానమేనని, అయితే, వారి అవకాశాలు వంటింటికి మాత్రమే పరిమితం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలో వినూత్న ఆలోచనలు పురుషుల అబ్బసొత్తేమీ కాదని డెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరెన్ వ్యాఖ్యానించారు. అద్భుత ఫలితాలను సాధించాలంటే చర్చల్లో మహిళలకు ప్రమేయం కల్పించి చూడాలని, ఒక్కసారి వారి ఆలోచనలు వింటే, మరేమాత్రం ఆలోచించకుండా అటువైవే అడుగులు వేస్తారని సూచించారు. మహిళలు ఏం చేసినా పురుషులకు మేలే జరుగుతుందని, ఏ పురుషుడైనా విజయం సాధించాడంటే, ఆయన వెనుక ఓ తల్లి, చెల్లి, భార్య, స్నేహితురాలి రూపంలో ఓ మహిళ తప్పక ఉంటుందన్న విషయాన్ని మరువరాదని చెర్రీ బ్లెయిర్ వ్యాఖ్యానించారు.