జివిఎల్‌కు టిడిపి ఎంపీల సవాల్‌

TDP
TDP

న్యూఢిల్లీ: బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావుపై టిడిపి ఎంపీలు మండిపడ్డారు. ఆధారాలు లేకుండా జివిఎల్‌ పిచ్చిగా మాట్లాడుతున్నారని, జివిఎల్‌కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. జివిఎల్‌ సర్పంచ్‌గానైనా గెలవగలరా అంటూ ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలపై కేంద్ర వైఖరి సరిగా లేదని ఎంపీ బుట్టా రేణుక ఆరొపించారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేయకపోగా ఇచ్చిన నిధులు వెనక్కితీసుకోడమేంటని నిలదీశారు. యూసిలు ఇచ్చినా ఇవ్వలేదనడం సరికాదని బుట్టా రేణుకా అన్నారు.