జిల్లాల పునర్విభజన జయప్రదం కావాలి!

TS CM Kcr
TS CM Kcr to Completed the List of New Districts (File)

జిల్లాల పునర్విభజన జయప్రదం కావాలి!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవ స్థీకరణ కు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. మంగళవారం విజయదశమి నాడు కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు వెభవో త్సవంగా ప్రారంభంకానున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్‌పి లు, తదితర అధికారుల నియామకం దస్త్రంపై ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావ్ఞ మంగళవారం తెల్ల వారుజామున సంతకం చేస్తారు.అంతకుముందు సోమ వారం జరిగిన అత్యవసర మంత్రిమండలి సమావేశం లో ఆమోదముద్రవేసి సోమవారం అర్థరాత్రి కర్కాటక లగ్నం శ్రవణనక్షత్రం, దశమి తుది గడియల్లో తుది ప్రక టన జారీకి ఏర్పాట్లయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్య క్రమాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు ఆయా మం త్రులు కొత్తగా నియమించిన అధికారులు సంబంధిత జిల్లాల కేంద్రాలకు, రెవెన్యూడివిజన్లకు, మండల కేంద్రా లకు సోమవారం రాత్రే చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సిద్ధపేట జిల్లా ప్రారంభోత్సవానికి స్వయంగా హాజరవ్ఞతారు. దీంతో తెలంగాణరాష్ట్రంలో పరిపాలన పరంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే చెప్పొ చ్చు. అధికార వికేంద్రీకరణ అనేది ప్రజలకు దగ్గరలో కార్యాలయాల ఏర్పాటు ప్రజలకు ప్రయోజనం చేకూర్చిం దనే విషయంలోమరో అభిప్రాయానికి తావ్ఞలేదు. గతం లో కూడా ఇది రుజువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు తెలుగుదేశాధ్యక్షుడు ఎన్‌టిరామారావ్ఞ తాలూకాలు, సమితులవ్యవస్థకు మంగళం పాడి మండ లి వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఆ వ్యవస్థ పట్ల కొన్ని విమర్శలు పెల్లుబుకాయి. ఆచరణలోఎన్నో ఇబ్బం దులు ఎదురవ్ఞతాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా భవనాల వసతి కల్పించడంలోనూ, అప్పటి పాలకులు కొంత నిర్లక్ష్యం చేశారనే చెప్పొచ్చు. ఉద్యో గులు ఉండడానికి సరైన వసతులు లేకపోవడం వల్ల ఆదిలో ఆశించిన మేరకు ప్రయోజనం చేకూరకపోయినా క్రమేణా మండలివ్యవస్థ ప్రజాదరణ పొందింది. ధృవీకర ణ పత్రాల కొరకు, పానీ నకళ్లు, భూసంబంధమైన వివా దాల కొరకో ఏ చిన్నపనికైనా దూరంలో ఉండే తాలూకా కేంద్రాలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడేవారు.

ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తీరాఅక్కడికి వెళ్లితే ఆ అధికారి ఉండకపోవడమోలాంటి సమస్యలుఎన్నో ఉండే వి. పరిధి పెద్దదికనుక అధికారులు టూర్‌ వెళ్లారని, లేక జిల్లా కేంద్రానికి సమావేశాల కోసం వెళ్లారని చెప్పేవారు. ఇలాంటి ఇబ్బందులు పూర్తిగా తొలగకపోయినా చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. అయితే ఇప్ప టికీ మండల కేంద్రాల్లో అధికారులు నివాసం ఉండడం లేదు. పక్కనున్న నగరాల నుండి రోజూ వెళ్లివచ్చే సంప్ర దాయం కొనసాగుతూనే ఉంది. వారికి తగిన వసతులు కల్పించలేకపోవడం వల్లనే ఈపరిస్థితులు ఏర్పడుతు న్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల పర్యవేక్ష ణ చేసేందుకు జిల్లా అధికారులకు సులభతరం అవ్ఞ తుంది. అయితే జిల్లాకేంద్రాల్లో అధికారులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరంఉంది. అందుకు తగిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కల్పించాలి. ఇక జిల్లాల ఏర్పాటులో కానీ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో కానీ కొన్ని లోటు పాట్లు జరిగాయని హేతుబద్ధత తెలియదని విమర్శలు వస్తు న్నాయి. ఆ విమర్శలను పూర్తిగా కొట్టిపారేయలేము కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతపెద్ద ఎత్తున జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ జరుగుతున్నప్పుడు కొన్ని తప్పవ్ఞ. అందులోనూ రాజకీయపార్టీలు అన్నతర్వాత ఎవరిఊహ లు, వ్యూహాలు వారికి ఉంటాయి. అంతేకాదు అందరినీ అన్నివేళల్లో సంతృప్తిపరచడం అనేది మానవ మాత్రుల కు సాధ్యమయ్యే పనికాదు. మరొక విషయం పరిపాలన సౌలభ్యం కొరకు కొత్తజిల్లాల ఏర్పాటుఅనేది ఈ రోజుకు రోజు వచ్చిన ప్రతిపాదనకాదు. గత సాధారణ ఎన్నికల సమయంలోనూ టిఆర్‌ఎస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో పొందుపరిచి బహిరంగ సభ ల్లోనే ప్రకటించారు. అధికారంలోకి వచ్చినతర్వాత కసర త్తుపై కసరత్తు, చర్చలపై చర్చలు చేశారు. సోమవారం అర్థరాత్రికి తుదిరూపం ఇచ్చారు. అన్నిలాంఛనాలు పూర్తి చేసుకొని మంగళవారం విజయదశమి రోజు కొత్తజిల్లాల నుంచి పాలన ప్రారంభంకానున్నది. ఆదిలో కొన్ని బారి ష్టాలు తప్పవ్ఞ. అయితే వాటిని అధిగమించేందుకు పాలకులు గట్టి కృషి చేయాలి.

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఈ పునర్విభజనతో అధికారుల ప్రాధాన్యత కొంతమేరకు తగ్గుతుంది. అదే సమయంలో రాజకీయ నాయకుల ప్రాముఖ్యత పెరుగుతుందనే అభి ప్రాయం పెల్లుబుకుతుంది. క్షేత్రస్థాయిలో పరిపాలన వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగితే ఫలితాలు కొంత మేరకైనా ప్రశ్నార్థకంగా మారుతాయి. ఇప్పటికే పోలీసు,రెవెన్యూ,తదితరశాఖల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. తమ నియోజకవర్గం పరిధిలో తమ అనుమతిలేకుండా అధికారులు పనిచేయడానికి లేదనే సంస్కృతి వర్ధిల్లుతున్నది. ఇలా నియోజకవర్గం, మండల పరిధి వరకు ఎవరికి వారు గిరిగీసి హద్దులు నిర్ణయిస్తున్నారు. ఇందువల్ల అధికారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.ఈదురాచారం ఇప్పటికిప్పుడు ప్రారం భం కాకపోయినా ఏనాటినుంచో ఉన్నారానురాను పెరిగి పోతున్నది. ఇప్పుడు కొత్త జిల్లాలు,
రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో ఇది మరింత పెరుగుతుందేమో నన్న అనుమానాలు వ్యక్తమవ్ఞతున్నాయి. ఏది ఏమైనా విజయదశమివేళ ప్రారంభం అవ్ఞతున్న ఈ కొత్త పరిపా లన శకానికి శుభం జరగాలి. పరిపాలన ప్రజారంజకం గా శుభప్రదంగా జరగాలి.

దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌,వార్త