జియో ప్రభావంతో ఊపందుకున్న రిల్‌ షేర్లు

JIO
JIO

జియో ప్రభావంతో ఊపందుకున్న రిల్‌ షేర్లు

ముంబయి,జూన్‌ 15: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌షేర్లు జియో ప్రభావంతో మరింత పెరిగాయి. జియోకు మొత్తం చందాదారుల సంఖ్య 11.26 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. మార్చినెలో 10.86 కోట్లనుంచి ఏప్రిల్‌ నెలలో 11.26 కోట్లకు పెరిగారు. దీనితో కంపెనీ షేర్లు కూడా 3.11శాతం పెరిగాయి. ట్రా§్‌ు తన నివే దికలో రిలయన్స్‌జియో టెలికాం యూనిట్‌ గరిష్ట సంఖ్యలో మొబైల్‌ చందాదారులను చేర్చుకోగలిగిందని ప్రకటించింది. ఏప్రిల్‌ ఒక్కనెలలోనే 3.9 మిలియన్ల మంది చందాదారులు అదనంగా చేరారు.

దీనితో నెలవారీగా వృద్ధి 3.56శాతంగా ఉంది. జియో చందాదారుల చేరికతో మార్కెట్‌ లీడర్‌ భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వంటి సంస్థలు కూడా 2.85 మిలియన్లు, 7.56 లక్షల మందిని అదనంగా చేర్చుకోగలిగాయి. జియో కొనసాగించిన టారిఫ్‌ విధా నం కూడా చందాదారుల బేస్‌ను పెంచింది. ఆర్‌జియో గతఏడాది సెప్టెంబరులోనే సేవలను ప్రారం భించింది. రిలయన్స్‌జియోలో2 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ముఖేష్‌ అంబానీ కుమ్మరించారు. ఏప్రిల్‌ 30వ తేదీనాటికి జియో మొత్తం చందాదారులు 11.26 కోట్లు అని ప్రకటించింది. మధ్యాహ్నం తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 2.81 శాతం పెరిగి 1351.30 రూపాయలకు చేరాయి. నిఫ్టీలో అత్యధిక లాభాలు పొందాయి. కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. మొత్తం 23.33లక్షల షేర్లు చేతులు మారాయి. రెండువారాల సగటు ట్రేడింగ్‌ 1.81లక్షల షేర్లుగా ఉన్నాయి.